తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికలకు నగారా మోగింది. ఇటీవలే టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLA Quota MLC Elections) షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఏపీ, తెలంగాణలో ఐదుగురు చొప్పున మొత్తం 10 మంది పదవీకాలం ముగియనుంది.

మార్చి 29వ తేదీ నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పి.అశోక్‌ బాబు, తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు పదవీ కాలం ముగియనుంది. ఇక తెలంగాణలో మహమూద్‌ అలీ, సత్యవతి రాఠోడ్‌, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్‌ హాసన్‌ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ముఖ్యమైన తేదీలు

ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ: మార్చి 3

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం: మార్చి 10

నామినేషన్ల పరిశీలన: మార్చి 11

నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 13

పోలింగ్‌: మార్చి 20 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)

ఓట్ల లెక్కింపు: మార్చి 20 (పోలింగ్‌ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి)

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *