హాయ్ నాన్న ప్రమోషన్స్ లో భాగంగా ఎక్స్ ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయిన నాని తెలంగాణ రిజల్ట్స్ పై కామెంట్స్ చేశారు.
Nani :నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ మూవీ డిసెంబర్ 7న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇక తన సినిమా ప్రమోషన్స్ అన్నిటిని తానే దగ్గరుండి చూసుకునే నాని.. హాయ్ నాన్న ప్రమోషన్స్ ని కేజ్రీగా నిర్వహిస్తూ ఆడియన్స్ లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఎక్స్ ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ఇంటరాక్షన్ లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు నాని సమాధానం ఇస్తూ వచ్చారు.
ఈ నేపధ్యలోనే ఒక నెటిజెన్.. ‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు కదా. మరి వచ్చిన ఎన్నికల ఫలితం పై మీ కామెంట్స్ ఏంటి’ అని ప్రశ్నించాడు. దీనికి నాని బదులిస్తూ.. ”పదేళ్లు ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూశాము. ఇప్పుడు థియేటర్ సినిమా మారింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాము” అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.