Pushpa 2: పుష్ప 2 స్టోరీ లీక్ చేసిన దేవి శ్రీ ప్రసాద్.. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్!

అల్లు అర్జున్ అభిమానులతో పాటు భారత సినీలోకం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న పుష్పా2 మూవీపై పూనకాలు తెప్పించే అప్పేట్ ఇచ్చారు ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్. పుష్పా2 స్క్రీన్ ప్లే ప్రేక్షకులను సీట్ల అంచును కూర్చోబెట్టేలా ఉంటుందంటూ అంచనాలు పెంచేశారు.
Devi Sri Prasad: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప 2’. ఇప్పటికే విడుదలైన ‘పుష్ప’ పార్ట్ 1 బ్లాక్ బస్టర్ గా నిలిచి రికార్డులను సృష్టించింది. అంతే కాదు రీసెంట్ గా నిర్వహించిన ’69th నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో ఈ సినిమాకు పలు విభాగాల్లో అవార్డులు వరించాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వరించింది.

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ తెరెకెక్కుతున్న ‘పుష్ప’ సీక్వెల్ పుష్ప 2 కోసం అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా ఈ సినిమా మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అభిమానులలో మరిన్ని అంచనాలు పెరిగేలా ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ‘పుష్ప 2’ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్లు.. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఉంటుందని తెలిపారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ గంగమ్మ తల్లిగా కనిపించడం సినిమాకే హైలెట్ గా ఉండబోతుందంటూ లీక్ ఇచ్చారు.

ప్రతీ సీన్ లో అల్లు అర్జున్ నటన అందరిని ఆశ్చర్యపడేలా చేస్తుందన్నారు రాక్ స్టార్ దేవీ. ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే ప్రేక్షకులను సీట్స్ లో అలాగే కూర్చోబెట్టేలా ఉంటుందంటూ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన ఈ అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గామారాయి. సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి. ఇప్పటికే జాతర సీన్స్ కు సంబంధించిన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

‘పుష్ప 2’ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్

Related Posts

పెళ్లి పీటలెక్కబోతున్న రామ్ చరణ్ హీరోయిన్

‘రూబా రూబా.. హే రూబా రూబా.. రూపం చూస్తే హాయ్ రబ్బా’.. అంటూ రామ్ చరణ్ తన గుండెల్లో వీణమీటిన హీరోయిన్ గురించి ఆరెంజ్ (Orange) సినిమాలో పాట పాడుతుంటాడు. అలా కేవలం చెర్రీ గుండెలోనే కాదు కుర్రకారు గుండెల్లో తిష్ట…

పద్మభూషణ్ బాలయ్యకు . సెలబ్రిటీల శుభాకాంక్షలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma Awards) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఈ జాబితాలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి నందమూరి బాలకృష్ణ, తమిళ ఇండస్ట్రీ నుంచి అజిత్ కుమార్, నటి శోభనలు పద్మభూషణ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *