టాలీవుడ్ స్టార్ హీరో, మన్మథుడు.. అక్కినేని నాగార్జున (Nagarjuna) చాలా కాలం నుంచి కళ్యాణ్ జ్యువెల్లర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ సంస్థ యాడ్స్ చాలా సంప్రదాయకరంగా, ఫుల్ ఫ్యామిలీ వైబ్స్ ఇస్తూ ఉంటాయి. తాజాగా ఈ సంస్థ మరో సరికొత్త యాడ్ తో మనముందుకు వచ్చింది. ఈ యాడ్ లోనూ నాగార్జున నటించారు. అయితే ఈసారి మాత్రం ఈ సంస్థ తమ జ్యువెల్లరీ ప్రమోషన్స్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా చేసింది.
చిరు డైలాగ్ ను ఇమిటేట్ చేసిన నాగ్
తాజాగా కళ్యాణ్ జ్యువెల్లర్స్ యాడ్ (Kalyan Jewelry) వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ యాడ్ లో నాగార్జున మెగాస్టార్ చిరంజీవిని ఇమిటేట్ చేశారు. ‘ఖైదీ 150 (Khaidi 150)’లో చిరంజీవి చెప్పిన.. “ఏదైనా సరే నాకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా.. కాదని బలవంతం చేస్తే కోస్తా” అనే డైలాగ్ ను నాగార్జున మిమిక్ చేశారు. బ్యాక్ గ్రౌండులో చిరు డైలాగ్ వస్తుంటే నాగ్ లిప్ సింక్ ఇస్తూ ఇమిటేట్ చేశారు. ఈ వీడియో చూసి ఇటు నాగ్ ఫ్యాన్స్, అటు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. చిరు మేనరిజాన్ని నాగ్ భలే ఇమిటేట్ చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు..
ఇక ఈ యాడ్ సంగతికి వస్తే.. ఇందులో నాగార్జున భార్య చిరంజీవి(Chiranjeevi)కి పెద్ద ఫ్యాన్. ఆమె గతం మర్చిపోతుంది. ఆమె పుట్టినరోజున నాగ్ కళ్యాణ్ జ్యువెల్లరి షాపు నుంచి కొనుగోలు చేసిన జువెలరీ గిఫ్ట్‌గా ఇస్తారు. ఇక ఆ తర్వాత ఏర్పాటు చేసిన పార్టీలో చిరంజీవి ఆల్ టైమ్ హిట్ సాంగ్ “మళ్లీ మళ్లీ ఇది రాని రోజు” సాంగ్ పాడుతూ డ్యాన్స్ చేస్తారు. సడెన్ గా పాట ఆగిపోగానే ఆయన భార్య మిగిలిన చరణం పాడుతుంది. యాడ్ చివరలో చిరుని నాగ్ ఇమిటేట్ చేయడం హైలైట్. మరి మీరు కూడా ఈ యాడ్ ను చూసేయండి మరి.
Kalyan Jeweller’s new ad !!
Chiru @KChiruTweets reference👌👌
Chiru Dialogue by @iamnagarjunaChiru Nag bonding always 👌 pic.twitter.com/QJeIo0q4gi
— Megastar (@Chirufan4ever) January 14, 2025







