Stock Market: మార్కెట్లు క్రాష్.. భారీగా పతనమైన సూచీలు

నేషనల్ స్టాక్‌ మార్కెట్లు(National stock markets) భారీ నష్టాల్లో(In heavy losses) ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో దేశీయ మార్కెట్లు వరుసగా 4వ రోజూ రెడ్‌లోనే క్లోజ్ అయ్యాయి. దలాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్(Dalal Street Stock Market) 5 రోజుల్లో తన మెరుపును పూర్తిగా కోల్పోయింది. Sensex, Nifty రెండూ 3 శాతానికి పైగా క్షీణించాయి. మంగళవారం(ఫిబ్రవరి 11)న రెండు సూచీలు ఒకటిన్నర శాతం క్షీణతను చవి చూశాయి. మార్కెట్ ముగిసేలోపు పెట్టుబడిదారులు రూ.10 లక్షల కోట్లు, ఫిబ్రవరి 4 నుంచి రూ.17.76 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు.

రెండు సూచీలూ ఆది నుంచి రెడ్‌లోనే..

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(BSE) కీలక సూచీ సెన్సెక్స్ ట్రేడింగ్ సెషన్‌లో ఒకానొక సమయంలో 1,281.21 పాయింట్లు పడిపోయి, ఒక రోజు కనిష్ఠ స్థాయి 76,030.59 పాయింట్లకు చేరుకుంది. చివరకు 1,018.20 పాయింట్లు కోల్పోయి 76,293.60 వద్ద స్థిరపడింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) ప్రధాన సూచిక నిఫ్టీ కూడా నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ సెషన్‌(Trading session)లో నిఫ్టీ 394.95 పాయింట్లు తగ్గి 22,986.65 పాయింట్లకు చేరుకుంది. చివరకు 309.80 పాయింట్లు కోల్పోయి 23,071.80 పాయింట్ల వద్ద ముగిసింది.

ఈ రంగాల సూచీలు పతనం

కాగా ఆటో, మీడియా, PSU బ్యాంక్, రియాల్టి, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఓ అండ్ జీ(O&G) సూచీలు 2-3% మేర పతనమయ్యాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, గ్రాసిమ్, ట్రెంట్, AIRTEL, బ్రిటానియా టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఐచర్‌, Apollo హాస్పిటల్స్, శ్రీరామ్ ఫిన్, కోల్ఇండియా, BEL టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. కాగా ఇంత మొత్తంలో మార్కెట్లు క్రాష్ అవడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *