
తెలంగాణ(Telangana)లోని ప్రజలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కొంతకాలంగా కొత్త రేషన్ కార్డుల(New Ration Cards)పై రోజుకో మాట చెబుతూ వస్తోన్న కాంగ్రెస్ సర్కార్.. ఎట్టకేలకు అప్లికేషన్ ప్రాసెస్(Applications)కు సంబంధించి అప్డేట్ ఇచ్చింది. దీంతో కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియ మళ్లీ మొదలైంది. ‘మీ సేవ(MeeSeva)’ అధికారులతో పౌరసరఫరాల శాఖ అధికారులు చర్చించిన అనంతరం దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్‌ను అధికారులు పునరుద్ధరించారు. దీంతో మూడు రోజుల తర్జన భర్జనకు తెరపడింది. పౌరసరఫరాల శాఖ ఆదేశాల(Department of Civil Supplies)తో ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచే ‘మీ సేవ’ వెబ్‌సైట్‌లో రేషన్‌కార్డుల దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
క్యాబినెట్ నిర్ణయంతో క్లారిటీ
అయితే, 8వ తేదీ ఉదయం వెబ్‌సైట్ నుంచి మాయమైంది. దీంతో దరఖాస్తు దారుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు సమావేశమైన పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్‌కార్డుల జారీపై మరింత లోతుగా చర్చించారు. ప్రజావాణి(Prajavaani) కార్యక్రమంలో ఇప్పటికే రేషన్‌కార్డులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం, క్యాబినెట్(Cabinate) నిర్ణయం కూడా ముందే జరగడంతో కార్డుల జారీకి సాంకేతికంగా ఎలాంటి సమస్య రాదన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించాలని మరోమారు ఆదేశించారు. దీంతో నిన్న సాయంత్రం నుంచి ‘మీ సేవ(MeeSeva)’ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
రూ.50 ఫీజు మాత్రమే తీసుకోవాలి
అయితే, ఇప్పటికే ప్రజాపాలన, కులగణన(Censes), ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పనిలేదని, వాటి పరిశీలన ఇప్పటికే మొదలైందని అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులతోపాటు ప్రస్తుతం నివాసముంటున్న విద్యుత్తు బిల్లు(Current Bill) కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రేషన్ కార్డు ఉండి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయాలనుకుంటే వారి ఆధార్ కార్డులను స్కాన్ చేయిస్తే సరిపోతుంది. రేషన్ కార్డు దరఖాస్తు కోసం రూ.50 మాత్రమే స్వీకరించాలని మీసేవలకు ఆదేశాలు జారీ చేసింది.