
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా (Maha Kumbh Mela)కు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు తెలుగు యాత్రికులు దుర్మరణం చెందారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టగా ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లోని సిహోరా సమీపంలో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏం జరిగిందంటే..?
సిమెంట్ లోడ్‌తో వెళ్తోన్న లారీ జబల్‌పుర్‌లోని సిహోరా సమీపంలో హైవే పైకి రాంగ్ రూట్‌లో రావడంతో ఈ ప్రమాదం (Road Accident in Madhya Pradesh) చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మరికొందరు యాత్రికులు మినీ బస్సులో చిక్కుకుపోయారని సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీసినట్లు వివరించారు. క్షతగాత్రులను సిహోరా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పిన అధికారులు.. మృతులంతా హైదరాబాద్ నాచారం వాసులని తెలిసినట్లు వెల్లడించారు.
మృతులంతా హైదరాబాద్ వాసులే
ప్రమాదానికి గురైన వాహనం నంబరు AP29 W 1525గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మినీ బస్సు రిజిస్ట్రేషన్ ఆధారంతా ప్రమాదానికి గురైన వారు ఏపీ వాసులు అయి ఉంటారని తొలుత భావించిన అధికారులు.. మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులను నాచారం వాసులుగా గుర్తించినట్లు తెలిపారు. వీరంతా మహాకుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
KCR : ‘తెలంగాణలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం’
‘నాన్నా.. పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుంది.’ ఓ సినిమాలో తలైవా రజినీ కాంత్ చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పుడు అచ్చం ఇదే డైలాగ్ ను కాస్త అటూ ఇటూగా మార్చి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…