ManaEnadu: వాతవారణంలో వస్తున్న మార్పులతోపాటు రోజురోజుకు కొత్త రకాల జబ్బులు వస్తున్నాయని మమత ఎడ్యుకేషనల్ సెక్రటరీ పువ్వాడ జయశ్రీ అన్నారు. ఖమ్మం నగరంలోని మమత ఆసుపత్రిలో జరుగుతున్న జాతీయ సదస్సు (ts apicon conference) ఆదివారంతో ముగిసింది.
కాలంతో పొటిపడి మరి రొగులకు వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొందని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక వైద్యసేవలు అందించే వెసులుబాటు సౌలభ్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. వీటితోపాటు వైద్యంతోపాటు నిపుణలు మందులు తయారీకి అవసరమైన పరిశోధన చేస్తూ మార్కెట్లోకి తీసుకరావడం జరుగుతుందని వివరించారు.
రాష్ట్రం లోనే ఖమ్మం జిల్లా లో ఇలాంటి సదస్సు జరిగిందని తెలిపారు. ఈసందర్భంగా సావనీర్ ఆవిష్కరించారు. 60 మందికి పైగా వక్తలు హజరై మూడు విభాగాలు వర్క్ షాప్ లు నిర్వహించారు. వెయ్యి మంది పీజీ డాక్టర్స్ సదస్సులో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో స్టేట్ ఫిజిషియాన్ చైర్మన్ కే రమేష్, కన్నెకంటిశివ రామకృష్ణ, కే శ్రీకాంత్, కే అనుదీప్ ఉన్నారు.