హిట్-3 సెట్‌లోకి నాని.. హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం

Mana Enadu: దసరా, హాయ్ నాన్న (Hi Nanna), సరిపోదా శనివారం సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన నేచురల్ స్టార్ నాని తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు. హీరోగా వరుస సక్సెస్లతో బిజీగా ఉన్న నాని ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌లో వచ్చిన హిట్ ఫ్రాంఛైజీలో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హిట్, హిట్2లతో అదరగొట్టిన ఈ బ్యానర్‌లో ఇప్పుడు హిట్-3 రాబోతోంది.

అడివి శేశ్ నటించిన హిట్-2 క్లైమాక్స్‌లోనే పార్ట్-3 గురించి హింట్ ఇచ్చి, అందులో హీరో నాని (Nani) అనే హింట్ కూడా ఇచ్చారు. సర్కార్ టేక్స్ ఛార్జ్ అంటూ హిట్-3 సినిమాలో నాని పాత్రకు సంబంధించి ఇటీవలే గ్లింప్స్ వదిలారు మేకర్స్. క్రైమ్‌ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ చిత్రంలో అర్జున్‌ సర్కార్‌ అనే ఓ పవర్ఫుల్ ఐపీఎస్‌ ఆఫీసర్గా నాని కనిపించనున్న విషయం తెలిసిందే. శైలేశ్‌ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న ‘HIT: The 3rd Case’ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇవాళ హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో నాని మొదటి రోజే షూట్‌లో జాయిన్ అయ్యారు. ఈ మూవీలో HIT ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా ఫిరోషియస్ క్యారెక్టర్‌లో నాని అదరగొట్టబోతున్నాడు. ఇందుకోసం నాని ప్రత్యేకంగా తన లుక్‌ కూడా ఛేంజ్ చేయబోతున్నాడట. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా (Wall Poster Cinemas)పై ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2025 మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కానుంది.

హిట్ ఫ్రాంచైజీలో విష్వక్‌ సేన్‌ ‘హిట్‌’, అడివి శేష్‌ (Adivi Sesh) ‘హిట్‌ 2’లో నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు హిట్-3పైన కూడా ప్రేక్షకులు ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్‌తో హిట్,హిట్-2ల కంటే హిట్-3 మరింత థ్రిల్లింగ్‌గా ఉండబోతుందని నెటిజన్లు అంటున్నారు.

Share post:

లేటెస్ట్