‘మ్యారేజ్‌ డ్రామా’లో శోభిత ధూళిపాళ.. లవ్ సితార ట్రైలర్ రిలీజ్

Mana Enadu: అక్కినేని నాగచైత్య (Naga Chaitanya) కాబోయే భార్య, నటి శోభితా ధూళిపాళ అటు పర్సనల్ లైఫ్‌లో ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీబిజీగా ఉంది. ఇటీవలే చైతన్యతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ భామ ఇక తన సినిమాలపై ఫోకస్ పెడుతోంది. తాజాగా శోభిత (Sobhita Dhulipala) ప్రధాన పాత్రలో ZEE5 ఒరిజినల్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘లవ్, సితార (Love Sitara)’. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఈ చిత్రం జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ మూవీ ట్రైల‌ర్‌ (Love, Sitara Trailer)ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమాను వందనా కటారియా తెరకెక్కించారు. ఓ ఫ్యామిలీలో కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఉండే వివిధ ర‌కాలైన స‌మ‌స్య‌లు, వారి చేసే తప్పులు, ఎమోష‌న్స్‌ను ఈ ట్రైలర్‌లో ఎలివేట్ చేశారు. రోనీ స్క్రూవాలా RSVP Movies నిర్మాణంలో ఈ మూవీ తెర‌కెక్కింది.

 

కేరళలోని ప్రకృతి అందాల మధ్య ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. తార‌ (Tara) అనే ఇండిపెండెంట్ అమ్మాయి పాత్రలో శోభితా పాత్రను తెరకెక్కించారు. ఈ సినిమాలో శోభిత ఇంటీరియ‌ర్ డిజైన‌ర్‌ పాత్రలో కనిపించనుంది. అంత‌ర్జాతీయంగా మంచి పేరున్న చెఫ్ అర్జున్ (Rajeev Sidhhartha)తో తార ప్రేమ‌లో పడుతుంది. వీరి పెళ్లి కోసం తార సొంతూరైన కేరళకు వెళ్తారు. ఇక అక్కడ పెళ్లికి ముందు రెండు కుటుంబాల్లో జరిగే సంఘటనల సమహారంగా ఈ సినిమా తీశారు.

తమ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, ఎన్నో ఏళ్ల నుంచి పర్ఫెక్ట్ ఫ్యామిలీ అనుకుంటున్న తమ కుటుంబాల్లో దాగి ఉన్న నిజాలు బయటపడిన తర్వాత ఈ జంట ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు సాగిందా? సాగితే ఎలా సాగింది అనేదే సినిమా. సోనాలి కులకర్ణి, బి.జయశ్రీ, రోడ్రిగ్స్, సంజయ్ భూటియాని, తమరా డిసౌజా, రిజుల్ రే కీలక పాత్రల్లో నటించారు. తార పాత్రలో నటించడం చక్కటి అనుభూతినిచ్చిందని శోభిత చెప్పుకొచ్చింది. నిజాయ‌తీగా ఉండే ఓ అమ్మాయి త‌న జీవితంలో ఎదురైన స‌వాళ్ల‌ను ధైర్యంగా ఎలా ఎదుర్కొంద‌నేదే ఈ క‌థ‌ అని తెలిపింది.

Share post:

లేటెస్ట్