Mana Enadu : తమిళ హీరో ధనుష్ (Dhanush)పై నటి నయనతార (Nayanthara) తీవ్రంగా ఫైర్ అయ్యారు. తన డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’ పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శిస్తూ ఓ బహిరంగ లేఖ రాశారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఆ కార్యక్రమం రిలీజ్ దగ్గర కానున్న సమయంలో ఆమోదం కోసం ఎదురుచూసి.. చివరకు ఆశలు వదులుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ధనుష్ పర్మిషన్ ఇవ్వకపోవడం తన హృదయాన్ని ముక్కలు చేసిందని.. వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్లగక్కడం కోసం ఇంతకాలం ఆగి ఆమోదం ఇవ్వకపోవడం బాధాకరమని వాపోయారు.
మీ ప్రతీకారంతో అందరికీ ఇబ్బందులు
‘‘తండ్రి, సోదరుడు (డైరెక్టర్) సపోర్ట్‌తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడయ్యారు. అలాంటి మీరు దీన్ని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా వృత్తికి, ముఖ్యంగా నన్ను ఆరాధించే అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటా. నా జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందిన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ(Nayanthara Documentary)ని ఎన్నో సవాళ్లు ఎదురైనా ఆత్మీయుల సహకారంతో రూపొందించాం. మీరు మాపై పెంచుకున్న ప్రతీకారం మమ్మల్ని మాత్రమే కాకుండా ఇందులోభాగమైన ఇతర సభ్యులను కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతోంది. నా మూవీ లైఫ్, లవ్ లైఫ్, మ్యారేజ్ తో పాటు నాతో ఉన్న అనుబంధాన్ని తోటి నటీనటులు పంచుకోవడం వంటి విశేషాలతో ఈ డాక్యుమెంటరీ రెడీ చేశాం.
#SpreadLove and Only Love pic.twitter.com/6I1rrPXyOg
— Nayanthara✨ (@NayantharaU) November 16, 2024
నా హృదయం ముక్కలైంది
కానీ మా లైఫ్ లో ఎంతో ముఖ్యమైన ‘నానుమ్ రౌడీ దాన్ (naanum rowdy dhaan)’ మాత్రం ఇందులో భాగం కాకపోవడం చాలా బాధాకరం. ఈ సినిమాలోని ఫొటోలు, వీడియోలు, పాటలు యూజ్ చేసుకునేందుకు NOC కోసం దాదాపు రెండేళ్ల నుంచి మీతో ఫైట్ చేస్తున్నాం. చివరకు మేము ఆశలు వదులుకోవాలని నిర్ణయించుకున్నాం. మీరు పర్మిషన్ ఇవ్వకపోవడం నా హృదయాన్ని ముక్కలు చేసింది.
మీ నిజస్వరూపం తెలిసింది
డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ (Nayanthara Series Trailer) రిలీజ్ చేసిన వెంటనే మీరు.. అందులో మూడు సెకన్ల క్లిప్స్ వాడుకున్నందుకు దాదాపు రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపడం దారుణం. ఇక్కడే మీ క్యారెక్టర్ ఏమిటనేది తెలిసిపోతుంది. మీ నోటీసుకు మేము లీగల్ గా సమాధానం ఇస్తాం. ఈ లేఖతో నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నా. తెలిసిన వారు విజయాలు అందుకుంటే అసూయ పడకుండా దాన్ని కూడా సంతోషంగా తీసుకోండి. ప్రేమను పంచండి. మాటల్లోనే కాకుండా చేతల్లోనూ మీరు దీనిని చూపించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని నయనతార రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లేఖ తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.






