Chaganti: ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం.. చాగంటికి కీలక బాధ్యతలు

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు(Prophet Chaganti Koteswara Rao)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) మరో కీలక బాధ్యతను అప్పగించింది. ఇప్పటికే ‘విద్యార్థులు-నైతిక విలువల సలహాదారు(Students-Moral Values ​​Adviser)’గా ఆయనను AP ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. క్యాబినెట్ హోదా(Cabinet status) కలిగిన ఈ బాధ్యతలను ఆయనకు ప్రభుత్వం అప్పగించింది. ఇటీవల CM చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను చాగంటి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత ఆయన బాధ్యతలను స్వీకరించారు.

క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం

ఇక తాజాగా చాగంటికి AP ప్రభుత్వం మరో కీలక బాధ్యత(Key responsibility)ను అప్పగించింది. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంచేందుకు చాగంటి(Chaganti)తో ప్రభుత్వం ప్రత్యేకంగా పుస్తకాల(Special Books)ను తయారు చేయించి, విద్యార్థులకు పంపీణీ చేయనుంది. రెండు రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ సమావేశం(Cabinet meeting)లో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ నిర్ణయం మేరకు చాగంటికి అదనపు బాధ్యతలను అప్పగించారు.

పిల్లలకు ఉపయోగపడేలనే ఉద్దేశంతోనే

ఈ బాధ్యతలను స్వీకరిస్తున్నట్టు చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. పిల్లలకు ఉపయోగపడేలా నాలుగు మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను స్వీకరిస్తున్నానని చెప్పారు. పదవుల కోసం తాను ఒప్పుకోలేదని, తన మాటలతో పిల్లలకు మేలు జరిగితే చాలని అన్నారు. ఇదే సమయంలో KG నుంచి PG దాకా ఇంటిగ్రేట్ చేస్తూనే.. స్టూడెంట్స్‌కు విలువలతో కూడిన పాఠ్యప్రణాళిక తయారు చేయాలనే మరో నిర్ణయం కూడా తీసుకుంది. సర్కారు బడుల్లో చదివే వారికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్కీమ్(Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Scheme) కింద కిట్లు అందజేయాలని డిసైడ్ అయింది.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *