Mana Enadu : ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (naga chaitanya), నటి శోభిత ధూళిపాళ (sobhita dhulipala ) వివాహం డిసెంబరు 4వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నూతన జంట అక్కినేని కుటుంబంతో కలిసి శ్రీశైలంలో సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు.
శ్రీశైలం సన్నిధిలో కొత్త జంట
#Yuvasamrat @Chay_akkineni @sobhitaD along with @iamnagarjuna visited Srisailam to seek the divine blessing of Sri Bhramaramba Mallikarjuna Swamy #Nagarjuna #NagaChaitanya #SobhitaDhulipala #SoChay #SoChayWedding pic.twitter.com/sri9kSFVG6
— chaitu saami (@MJitendra999) December 6, 2024
అనంతరం అర్చకులు నూతన దంపతులకు (Chaitu Sobhita) ఆశీర్వచనం అందజేశారు. మొదట ఈ కుటుంబానికి మహాద్వారం వద్ద ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి శ్రీశైలం పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
రింగు కోసం కొత్తజంట పోటీ
Two souls one heart Perfectly matched @chay_akkineni @sobhitaD #NagaChaitanya #NagaChaitanyaSobhitawedding #NagaChaitanyaSobhita pic.twitter.com/F1WSbmongZ
— chaitu saami (@MJitendra999) December 6, 2024
మరోవైపు బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన చైతూ-శోభిత (naga chaitanya sobhita dhulipala wedding) వివాహానికి సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ జంట రింగు కోసం పోటీ పడిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. సాధారణంగా పెళ్లి వేడుకలో ఓ బిందెలో నీరు పోసి అందులో ఉంగరం వేసి వధూవరులను వెతకమని చెప్పే ఓ కార్యక్రమం ఉంటుంది. తాజాగా వీరి వివాహ వేడుకలో కూడా ఆ కార్యక్రమం నిర్వహించగా రింగు కోసం జరిగిన ఈ పోటీలో చైతూ గెలిచాడు.
నా హృదయం ఉప్పొంగుతోంది
ఇక నాగచైతన్య- శోభిత పెళ్లి ఫొటోలను నాగార్జున తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి ఓ హార్ట్ ఫెల్ట్ సందేశాన్ని రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు, ఫ్యాన్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘డియర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్యాన్స్.. మీ ప్రేమ, ఆశీస్సులు ఈ వేడుకను ప్రత్యేకం చేశాయి. ఈ అందమైన క్షణాల్లో మమ్మల్ని అర్థం చేసుకున్న మీడియాకు ధన్యవాదాలు. కృతజ్ఞతతో నా హృదయం ఉప్పొంగుతోంది’ అని నాగ్ తన పోస్టులో రాసుకొచ్చాడు.







