కేంద్ర ప్రధాన ఎన్నికల(CEC) అధికారిగా జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar) ఇవాళ (ఫిబ్రవరి 19) బాధ్యతలు స్వీకరించారు. కాగా నిన్నటితో రాజీవ్ కుమార్ పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే జ్ఞానేశ్ కుమార్ నియామకానికి కేంద్రం ప్రతిపాదించగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) వ్యతిరేకించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) నేతృత్వంలో ఫిబ్రవరి 17న జరిగిన సమావేశంలో CECగా జ్ఞానేష్ కుమార్‌ను నియామించారు. అయితే ఇది అర్ధరాత్రి తీసుకున్న హడావుడి నిర్ణయమని రాహుల్ మండిపడ్డారు. కాగా 1989 బ్యాచ్ IAS అధికారి అయిన ఆయన హరియాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. కాగా సీఈసీగా జనవరి 26, 2029 వరకూ కొనసాగుతారు.
#WATCH | Delhi: Newly-appointed Chief Election Commissioner Gyanesh Kumar takes charge of the office. pic.twitter.com/0GJ6HiBI1v
— ANI (@ANI) February 19, 2025
CJIని తొలగించడంపై సుప్రీంలో పిటిషన్
అయితే పాత విధానం ప్రకారం.. ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) కూడా సభ్యుడిగా ఉండేవారు. అయితే, 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు బదులు కేంద్ర మంత్రివర్గం నామినేట్ చేసే మంత్రికి స్థానం కల్పించింది. దాని ప్రకారమే ఇప్పుడు కేంద్ర మంత్రివర్గం తరపున కేంద్రమంత్రి అమిత్ షా(Amit Shah) ఉన్నత స్థాయి కమిటీలో సభ్యుడిగా హాజరయ్యారు. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు(Supreme Court)లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది.






