Mana Enadu: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) తాజాగా భారీ జాబ్ నోటిఫికేషన్(Job Notification) విడుదల చేసింది. దీని ద్వారా 500 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. దేశంలో ఉన్న నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ(National Insurance Company) కార్యాలయాల్లో క్లాస్-III కేడర్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల(Assistant posts) భర్తీకి దరఖాస్తుల(applications)ను కోరుతూ NICL నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు.
దేశవ్యాప్తంగా మొత్తం 500 పోస్టుల్లో APలో 21 పోస్టులు, తెలంగాణలో 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్హతతో పాటు అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలని పేర్కొన్నారు. 01.10.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. SC/ STలకు ఐదేళ్లు, OBCలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఇచ్చారు.
కాగా నేటి (అక్టోబర్ 24న) నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ కానుండగా.. NOV 11 చివరితేది. అప్లై చేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్ ప్రిలిమినరీ, ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి వీటి ఆధారంగా ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ.22,405- రూ.62,265 ఉంటుంది. పూర్తి వివరాలకు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ https://nationalinsurance.nic.co.in/ చూడొచ్చు.