‘టాలీవుడ్’పై సీఎం రేవంత్ ‘వైల్డ్ ఫైర్’.. ఇక నో బెనిఫిట్ షోస్

Mana Enadu : తెలంగాణ శాసనసభ సమావేశాల్లో (Telangana Assembly Sessions) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తన ప్రకటనతో టాలీవుడ్ కు రేవంత్ బిగ్ షాక్ ఇచ్చారు. తాను సీఎంగా ఉన్నంతకాలం సినిమా టికెట్లపై ప్రత్యేక రాయితీలు కల్పించబోనని ప్రకటించారు. కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఏం జరిగిందో ప్రభుత్వం ప్రకటన చేయాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కోరగా.. సీఎం రేవంత్ (CM Revanth Pushpa 2) ప్రకటన చేశారు.

ఒక్కరికీ మనసు రాలేదు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమపై, ప్రతిపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటన (Sandhya Theatre Stampede)లో పోలీసులు వారి విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించారని స్పష్టం చేశారు. కానీ అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన తర్వాత కొందరు రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు తనపై నీచంగా పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. సినిమా చూడటానికి వెళ్లిన ఓ కుటుంబంలో తల్లి చనిపోయి, కుమారుడు చావుబతుకుల్లో దానికి ఓ రకంగా బాధ్యులైన హీరో, నిర్మాత కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లలేదని అన్నారు.

ప్రజల ప్రాణాలు పోతుంటే మేం సహించం

“అలాంటి వారిని అరెస్టు చేస్తే బెయిల్ (Allu Arjun Bail)పై విడుదలైన తర్వాత అతణ్ని చూసేందుకు సినిమా వాళ్లంతా ఆయన ఇంటి వద్ద క్యూ కట్టారు. ఇప్పటి వరకు మా ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తూ వచ్చింది. పెద్ద పెద్ద చిత్రాలు రిలీజ్ అయినప్పుడు రాయితీలను ఇస్తూ ప్రోత్సాహం కల్పించింది. టికెట్ ధరలు పెంపు, బెనిఫిట్ షో(Benefit Shows in Telangana)లకు అనుమతి ఇచ్చింది. కానీ ఇలా కొందరు నటులు వ్యవహరించే పద్ధతి వల్ల ప్రజల ప్రాణాలు పోతుంటే వాళ్లను ఏమొనొద్దు అంటే సహించేది లేదు. ఫిల్మ్‌స్టార్స్‌, సూపర్‌స్టార్‌, పొలిటికల్‌ స్టార్స్‌ హత్యలు చేసినా, వాళ్లను విచారించొద్దని మీరు చట్టం చేస్తానంటే, అమలు చేస్తాం. ” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

అల్లు అర్జున్ కాళ్లు విరిగాయా?

ఒక్కరోజు అల్లు అర్జున్ ఠాణాకు వెళ్లొస్తే అతనికేదో జరిగినట్లు కన్నీళ్లు కారుస్తున్నారని రేవంత్ (CM Revanth Allu Arjun News) మండిపడ్డారు. ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని చూసేందుకు సినీ ప్రముఖులు ఒక్కరైనా వెళ్లారా..? కానీ హీరో జైలు నుంచి రాగానే ఆయన ఇంటికి క్యూ కడుతూ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారని ఫైర్ అయ్యారు. అమానవీయ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలు కాపాడటమేత న బాధ్యత అని స్పష్టం చేశారు.

నేను సీఎంగా ఉన్నంతవరకు ఆ ఆటలు సాగవు

“సినిమాలు తీసుకోండి. వ్యాపారం చేసుకోండి. డబ్బు సంపాదించుకోండి. మా ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు అందితే అవి కూడా తీసుకోండి. షూటింగ్‌లకు సంబంధించి ప్రత్యేక పర్మిషన్స్ తీస్కోండి. కానీ మీ వల్ల, ఇలాంటి ఘటనల వల్ల  ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం మా సర్కార్ సహించదు.  నేను ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నంత వరకూ ఇలాంటి ఘటనలను ఉపేక్షించను ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎవరినీ ప్రభుత్వం వదిలి పెట్టదు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *