Mana Enadu : అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై అల్ ఖైదా ఉగ్రవాదుల దాడుల గురించి ప్రపంచం మొత్తానికీ తెలిసిందే. అయితే తాజాగా రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ (Russia Ukraine War) కూడా ఇలాగే విరుచుకుపడుతోంది. శనివారం రోజున ఉక్రెయిన్ రష్యాలోని కజాన్ నగరంపై డ్రోన్లతో దాడులకు తెగబడినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. నగరంలోని నివాస సముదాయాలపై ఎనిమిది డ్రోన్ల (Ukraine Drone Attacks)తో దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే అక్కడి విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేసినట్లు పేర్కొంది.
నా కళ్లతో చూశాను
మరోవైపు ఉక్రెయిన్ ప్రయోగించిన పలు డ్రోన్‌లను కూల్చివేశామని స్థానిక అధికారులు తెలిపారు. నివాస సముదాయాలపై జరిగిన దాడుల్లో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించారు. మరోవైపు ఈ దాడులకు సంబంధించిన దృశ్యాలు (Kazan City News) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నా కళ్లతో చూశాను. నేను నివసిస్తున్న ప్రాంతం సమీపంలోని ఓ భవనంపై డ్రోన్ అటాక్ జరిగింది. నా చేతులు వణుకుతుండగా నేను ఈ పోస్టు చేస్తుండగానే ఈ నగరంలో మరో చోట ఇంకో దాడి చోటుచేసుకుంది.” అంటూ ఓ స్థానిక వ్యక్తి నెట్టింట చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.
My hands are shaking.. I saw it with my own eyes. The building next to our apartment block was hit by drones.
While I was writing this, another explosion in different place in Kazan.
Horrible! pic.twitter.com/iDmGcKte4p— Natalia (@NataliaPRussia) December 21, 2024
ఏళ్లు గడుస్తున్నా దాడులు ఆగడం లేదు
ఉక్రెయిన్-రష్యా (Russia Ukraine Conflict)మధ్య యుద్ధం ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఇది ఓ కొలిక్కి రావడం లేదు. తరచూ ఇరు దేశాలు పరస్పర దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో సైనికులతో పాటు అప్పుడప్పుడు పౌరులు కూడా మరణిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా రష్యా వరుస దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతుండగా తాజాగా ఉక్రెయిన్ ఎదురు దాడులు మొదలుపెట్టింది.
ప్రతీకారం తప్పదు
ఇటీవల 93 క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులు, 200లకు పైగా డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేయగా.. వాటిలో 72 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు ప్రకటించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత మాస్కో చేసిన అతి పెద్ద దాడి ఇదేనని ఉక్రెయిన్ తెలిపింది. లక్షల మంది తమ పౌరులను రష్యా భయపెడుతోందని.. దీనిపై ప్రపంచం స్పందించాలని.. అప్పుడే రష్యా ఉగ్రవాదం ఆగుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) అన్నారు. అప్పటి వరకు తాము కూడా ప్రతీకార దాడులు చేస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు.
रूस के कजान में ड्रोन से 9/11 जैसा हालमा
रुसी मीडिया के अनुसार, राजधानी मोस्को से 720 किलोमीटर दूर कजान में बहुमंजिला इमारत पर एक के बाद एक 8 ड्रोन दागे गए।#Kazan #Russia pic.twitter.com/WtlWgYqQFX— Badshahbhai (@Badshahbhai7383) December 21, 2024






