Telangana Elections: ఇవాళ్టి నుంచి నామినేషన్ల సందడి షురూ.. తొలి నామినేషన్ ఎవరిదంటే..

ఇవాళ్టి నామినేషన్ల సందడి షురూ కానుంది. మరోవైపు నామినేషన్ల దాఖలుకు మంచి మూహూర్తాల కోసం నేతలంతా రెడీ అవుతున్నారు. తెలంగాణలో ఎన్నికల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే నేడు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 10 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 13న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 ఆఖరు. నోటిఫకేషన్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.

తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో భాగంగా నేడు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల సందడి షురూ కానుంది. మరోవైపు నామినేషన్ల దాఖలుకు మంచి మూహూర్తాల కోసం నేతలంతా రెడీ అవుతున్నారు. తెలంగాణలో ఎన్నికల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే నేడు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 10 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 13న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 ఆఖరు.

నోటిఫకేషన్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఎన్నికల పరిశీలకులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 67 మంది ఐఏఎస్ లను, 39 మంది ఐపీఎస్ అధికారులను నియమించింది సెంట్రల్ ఎన్నిక కమిషన్. ఎన్నికల్లో ఖర్చును పరిశీలించేందుకు ప్రత్యేకంగా 60 మంది ఐఆర్ఎస్ అధికారులను నియమించారు. ఒక్కో అధికారికి రెండేసి అసెంబ్లీ సెగ్మెంట్లను అప్పగించారు. ఇక అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుంచి ఖర్చు లెక్కిస్తారు అధికారులు.

నామినేషన్ వేసే రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద అన్ని రకాల భద్రత ఏర్పాట్లు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి 100 మీటర్ల వరకు 144 సెక్షన్ విధింపు ఉంటుంది. 3 తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆదివారం 5వ తేదీ సెలవు కావడంతో నామినేషన్లు తీసుకోమన్నారు అధికారులు.

ఇక 8 నుంచి 10వ తేదీ వరకు మంచి రోజులు ఉండటంతో ఆ రెండు మూడు రోజుల్లోనే ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు మంచి ముహూర్తాల్లోనే నామినేషన్లు వేయాలని నేతలు ఎదురు చూస్తున్నారు.

మంచి ముహూర్తం కోసం అనేక పార్టీల నేతలు తనను సంప్రదించారని వరంగల్‌కు చెందిన వెంకటేశ్వర స్వామి తెలిపారు. మరోవైపు నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకమైన లీగల్ టీమ్స్ ను ఏర్పాటు చేసుకున్నాయి. తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్‌ మూడున ఫలితాలు వెలువడతాయి.

Related Posts

RajyaSabha: విజయసాయి రాజీనామా.. ఎంపీ సీటు ఆ సీనియర్ నేతకేనా?

రాజ్యసభ సభ్యుడిగా ఉన్న YCP సీనియర్ నేత విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) తన పదవికి శనివారం రాజీనామా(Resignation) చేశారు. ఆయన పదవీ కాలం 2028 జూన్ 21 వరకూ ఉంది.. అంటే MPగా మరో మూడున్నరేళ్ల పాటు ఆ పదవిలో…

Kodali Nani: వైసీపీకి గుడ్ బై.. కొడాలి నాని క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో పాలిటిక్స్(Politics) ఒక్కసారిగా హీటెక్కాయి. YCP సీనియర్ నేత, రాజ్యసభ MP విజయసాయి రెడ్డి(VIjaya Sai Reddy) రాజకీయాలకు గుడ్ బై చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. సడెన్‌గా ఆయన తీసుకున్న నిర్ణయం వెనుక అసలు కారణమేంటి? అసలు ఎందుకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *