
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇక పవన్ రాజకీయాల్లో బిజీ అయితే ఆయన వారసుడు అకీరా నందన్ (Akira Nandan) సినిమాల్లో బిజీ అవుతాడని పవర్ స్టార్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు అకీరా ఎంట్రీ ఉంటుందా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం చదువుకుంటున్న అకీరా.. నటనతో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాడు.
అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ
ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ తో కలిసి అకీరా పలు కార్యక్రమాల్లో కనిపిస్తున్నాడు. ఇక తండ్రితో కలిసి సనాతన ధర్మ యాత్ర కూడా చేశాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అకీరా అచ్చం యూత్ లో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగానే ఉన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే అకీరా నందన్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ (Akira Nandan Tollywood Entry) ఇవ్వాలని కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ ఎంట్రీ ఉంటుందని సమాచారం.
OG సినిమాకు పని చేస్తున్న అకీరా
అయితే అకీరా టాలీవుడ్ ఎంట్రీ అనేది ఫిక్స్ అని సన్నిహిత వర్గాల సమాచారం. కానీ ఆ ఎంట్రీ ఇప్పట్లో ఉండదని చెబుతున్నారు. మరో రెండేళ్ల తర్వాత ఈ ఎంట్రీ ఉంటుందని తెలిపారు. అప్పటిలోగా అకీరా.. నటన, డాన్స్ మిగిలిన విభాగాల్లో పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకోనునున్నాడట. అకీరా ఇప్పటికే డైరెక్షన్, మ్యూజిక్ లో తన ప్రావీణ్యం చూపిస్తున్నాడు. తన తండ్రి పవన్ కళ్యాణ్ నటిస్తున్న (OG Movie) సినిమాకు తమన్ తో కలిసి వర్క్ చేస్తున్నాడట అకీరా.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…