రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ తర్వాత ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. RC16 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత చెర్రీ సుకుమార్ (Sukumar)తో ఓ ప్రాజెక్టు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మోడర్న్ యాక్షన్ డ్రామా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రం గురించి ఇప్పుడు ఓ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

రామ్ చరణ్ – సుకుమార్ హీరోయిన్ ఎవరంటే

సుకుమార్ ఇటీవలే పుష్ప-2 (Pushpa-2) సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తో తీయనున్న చిత్రంలోనూ రష్మికనే హీరోయిన్ గా తీసుకోవాలని సుకుమార్ భావిస్తున్నాడట. యానిమల్, పుష్ప-2, ఛావా సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన శ్రీవల్లి ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయింది.

Image

అప్పుడు మిస్ అయ్యాం

అయితే రామ్ చరణ్, రష్మిక మందన్న (Rashmika Mandanna) కాంబో గతంలోనే రావాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఆచార్య (Aacharya)’ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో చెర్రీకి జోడీగా రష్మిక మందన్నను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారట. కానీ ఆ సమయంలో పుష్ప సినిమాతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ క్యాల్షీట్లు ఖాళీగా లేకపోవడంతో ఈ కాంబో కుదరలేదు. ఇక ఇప్పుడు సుకుమార్ ఆ లోటును తీర్చబోతున్నట్లు సమాచారం.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *