దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ‘బాహుబలి (Bahubali)’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తం చేశారు. తన సినిమాలతో ఆయన వరల్డ్‌వైడ్‌గా ఆయన క్రేజ్ సంపాదించారు. ఇక అప్పుడప్పుడు తన సినిమాల్లో ఆయన స్క్రీన్ పైనా మెరుస్తుంటారు. గెస్ట్ రోల్స్ లో కనిపించి ఆడియెన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తుంటారు. ఇక రాజమౌళి (SS Rajamouli)లో మంచి నటుడు ఉన్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఓ బుల్లితెర యాంకర్ తో లవ్ ట్రాక్ నడిపారన్న విషయం మీకు తెలుసా..?
రష్మీతో జక్కన్న రొమాన్స్
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) గురించి తెలియని వారుండరు. ఈ భామ బుల్లితెరపై మెరుస్తూ.. అప్పుడప్పుడు వెండితెరపైనా కనిపిస్తుంటుంది. ఇక ఈ బ్యూటీ యువ, లవ్ వంటి సీరియల్స్ లో కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మి, జక్కన్నతో కలిసి ఓ లవ్ ట్రాక్ సీన్ లో నటించింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. జక్కన్నలో ఈ రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Whatttt!!! Rajamouli and rashmi ideppudu jarigindi 😭 pic.twitter.com/nHM2LwyuCI
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) February 18, 2025
రష్మీ-రాజమౌళి లవ్ ట్రాక్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా ‘విక్రమార్కుడు (Vikramarkudu)’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ సమయంలో బుల్లితెరపై ‘యువ (Yuva Serial)’ అనే తెలుగు సీరియల్ వచ్చేది. ఆ సీరియల్లో రష్మీ గౌతమ్ రేడియో జాకీ పాత్రలో నటించింది. అయితే విక్రమార్కుడు ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి ఈ సీరియల్లో గెస్ట్ రోల్లో కనిపించారు. ఈ క్రమంలోనే ఆయన రష్మీతో కలిసి ఓ లవ్ ట్రాక్ లో నటించారు.
భలే క్యూట్ లవ్ స్టోరీ గురూ
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో రష్మీని ప్రేమించే వ్యక్తిగా కనిపించారు రాజమౌళి. వీళ్లిద్దరి మధ్య ఓ లవ్ ట్రాక్ నడిచింది. ఇందులో రష్మీ, రాజమౌళి (Rashmi Rajamouli Video) జంట చాలా క్యూట్ గా కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రష్మీ-రాజమౌళి జంట భలే ముద్దుగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. జక్కన్న లవ్ ట్రాక్ భలే ఫన్నీగా ఉంది అంటున్నారు. అరే.. ఇన్నాళ్లూ ఈ వీడియోను ఎలా మిస్ అయ్యామంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.






