ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ‘మహాకుంభమేళా(Maha Kumbh Mela)’ ఫిబ్రవరి 26వ తేదీన ఘనంగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన కుంభమేళా ను కోట్లాది మంది భక్తులు సందర్శించారు. దేశవిదేశాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివచ్చి త్రివేణిసంగమంలో పుణ్యస్నానం చేశారు. ఇక కుంభమేళా ముగిసిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) భక్తులకు ఓ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తన బ్లాగ్‌లో ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు.
దిగ్విజయంగా ముగిసిన మహాయజ్ఞం
మహాకుంభమేళా వంటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులువు కాదని ప్రధాని మోదీ అన్నారు. ఏర్పాట్ల విషయంలో భక్తులెవరైనా అసౌకర్యానికి గురైతే క్షమించాలని కోరారు. ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసిందని మోదీ తెలిపారు. భారతీయ ఐక్యతకు కుంభమేళా (PM Modi On Kumbh Mela) నిదర్శనంగా నిలిచిందన్న ఆయన.. వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారని చెప్పారు.
महाकुंभ संपन्न हुआ…एकता का महायज्ञ संपन्न हुआ। प्रयागराज में एकता के महाकुंभ में पूरे 45 दिनों तक जिस प्रकार 140 करोड़ देशवासियों की आस्था एक साथ, एक समय में इस एक पर्व से आकर जुड़ी, वो अभिभूत करता है! महाकुंभ के पूर्ण होने पर जो विचार मन में आए, उन्हें मैंने कलमबद्ध करने का… pic.twitter.com/TgzdUuzuGI
— Narendra Modi (@narendramodi) February 27, 2025
మమ్మల్ని క్షమించాలి
మహాకుంభమేళాను సూపర్ సక్సెస్ చేసిన యూపీ సర్కార్ (UP Govt), ప్రజలకు ధన్యవాదాలు. అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం అంత ఈజీ కాదు. మా పూజల్లో, ఏర్పాట్లలో ఏదైనా లోపం ఉంటే క్షమించాలని ఆ గంగా, యమునా, సరస్వతి మాతలను ప్రార్థిస్తున్నాను. భక్తులకు సేవ చేయడంలో ఏదైనా లోపం ఉంటే అందుకు ప్రజలు కూడా క్షమించాలి. అని ప్రధాని మోదీ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు.






