Madhavi Latha Issue: JC ప్రభాకర్ రెడ్డికి షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు

తాడిపత్రి మాజీ MLA జేసీ ప్రభాకర్‌ రెడ్డి(JC Prabhakar Reddy)కి పోలీసులు షాకిచ్చారు. సినీ నటి మాధవీ లత(Madhavi Latha)పై అసభ్యకరమైన కామెంట్స్ చేసినందుకు ఆయనపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు(Cyberabad Cyber ​​Crime Police) పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా జేసీ తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అయితే ఆ ఈవెంట్‌కు ఎవరూ వెళ్లొద్దని మాధవీ లత ఓ వీడియో విడుదల చేశారు. దీంతో సీరియస్ అయిన జేసీ ఆమెపై అసభ్యకరంగా మాట్లాడుతూ.. ఆమెను BJP ఇంకా ఎందుకు తమ పార్టీలో కొనసాగిస్తుందోనని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

క్షమాపణలు చెప్పినా సద్దుమణగలేదు..

దీంతో మాధవీ లత TDP అధిష్ఠానానికి, మూవీ అసోసియేషన్‌(MAA association)కు ఫిర్యాదు చేసింది. అలాగే జనవరి 21న జేసీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబరాబాద్ సైబర్ క్రైమ్(CCC) పీఎస్‌ను ఆశ్రయించింది. కాగా అంతకుముందు మాధవీలతపై JC చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో వెనక్కి తగ్గిన ఆయన మాధవీలతకు క్షమాపణలు(Apologies) కూడా చెప్పారు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం సద్దుమణిగిపోయినట్లేనని అందరూ భావించారు. కానీ తాజాగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడంతో మళ్లీ ఈ వివాదం తెరమీదకి వచ్చింది.

Madhavi Latha: అందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిర్యాదు చేశా..! | Madhavi  latha files complaint against jc prabhakar reddy to maa over tadipatri new  year issue-10TV Telugu

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *