సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా, లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘కూ(Cooli)’ నుండి రెండో సింగిల్ ‘మోనికా(Monica)’ విడుదలై, సోషల్ మీడియా(Social Media)లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) తన గ్లామరస్ లుక్, అద్భుతమైన డ్యాన్స్ స్టెప్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే అదరగొట్టే పర్ఫార్మెన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇది పూజా హెగ్డే, సౌబిన్(Soubin)లపై చిత్రీకరించిన పాట. కాగా కూలీ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది.
![]()
బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో..
‘‘మోనికా బెలూచి.. ఎగిరే వచ్చింది.. కడలే కదం తొక్కే సునామీయే తెచ్చింది’’ అంటూ హుషారుగా సాగిన ఈ గీతానికి అనిరుధ్(Anirudh) స్వరాలు సమకూర్చడమే గాక సుభ్లాషిణి(Sublashini)తో కలిసి స్వయంగా ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యమందించారు. ఈ పాటలో పూజా (Pooja Hegde) వేసిన స్టెప్పులు ఆకర్షణగా నిలిచాయి. బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఆసక్తికర కథతో రూపొందిన చిత్రమిది. శ్రుతిహాసన్ దీంట్లో ముఖ్య పాత్ర పోషించింది. నాగ్ ప్రతినాయకుడిగా నటించారు. మరి పూజా స్టెప్పులను మీరూ చూసేయండి.






