ఈ రెండు లక్షణాలుంటే త్వరగా ధనవంతులవుతారట!

Mana Enadu : ‘వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి.. రెస్పెక్ట్ (Respect) కావాలంటే డబ్బు ఒంటిపై కనబడాలి’.. అంటూ ఇటీవలే ఓ సినిమాలో హీరో చెప్పిన డైలాగ్ కు థియేటర్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ చప్పట్లు మోగాయి. డబ్బు.. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. మానవ సంబంధాలు (Human Relations) కూడా ఇప్పుడు డబ్బుపైనే ఆధారపడిన రోజులొచ్చాయి. అందుకే డబ్బు సంపాదించడానికి జనం ఎంతో కష్టపడుతుంటారు. అయితే సంపాదించడం కూడా ఒక కళ. 

కష్టపడి సంపాదించడం ఒక కళ అయితే.. తెలివితేటలతో సంపాదించడం మరో కళ. హార్డ్ వర్కర్స్ కంటే స్మార్ట్ వర్కర్స్ సులభంగా సంపాదిస్తుంటారు. అయితే సంపాదించాలన్న పట్టుదల, చేస్తున్న పనిపట్ల ఆసక్తి, తెలివితేటలు ఉన్న వారు డబ్బు ఎక్కువగా సంపాదిస్తుంటారు. సైకాలజీ (Psychology) ప్రకారం డబ్బు సంపాదించే అబ్బాయిలు సమయాన్ని ఎక్కువగా వృథా చేయరట. సమయాన్ని డబ్బు సంపాదనకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారట. 

డబ్బు సంపాదించే వారికి రెండు లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. అందులో ఒకటి లక్ష్యం వైపు పయనించడం.. మరొకటి సరైన ప్రణాళిక (Planning). తన లక్ష్యమేంటో తెలిసిన వ్యక్తి.. సమయం వృథా చేయకుండా ఆ లక్ష్యం వైపునకు పయనిస్తుంటాడు. డబ్బు సంపాదించాలన్న పట్టుదల ఉన్న వారు తమ లైఫ్ లో భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుని లక్ష్యం వైపునకు పయనిస్తారు. తమకు ఆర్థికంగా కలసి వస్తుందా లేదా అనేది చూసుకునే వీరు నిర్ణయాలు తీసుకుంటారు.

ఇక డబ్బు సంపాదనకు కావాల్సిన మరో లక్షణం..  సరైన ప్రణాళిక. పక్కా ప్రణాళికతో పట్టుదలతో కాస్త ఓపికతో సంపాదించే వారి జీవితంలో లక్ష్మీకళ ఉట్టిపడుతుందట. అయితే డబ్బు సంపాదించాలంటే పని పట్ల అంకిత భావం ఉండాలని.. చేసే పనిపై ఇష్టం ఉండాలని సైకాలజీ చెబుతోంది. ఇలాంటి అబ్బాయిలు.. ఎక్కువ ధనవంతులు అవ్వడానికి చూస్తుంటారని.. పక్కా ప్లాన్ తో త్వరగానే ధనవంతులు అయిపోతారని అంటున్నారు.

Related Posts

RBI Interest Rates : వరుసగా 11వసారి వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్

Mana Enadu : అంతా అనుకున్నట్టుగానే.. విశ్లేషకులు అంచనా వేసినట్టుగానే.. జరిగింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) వరుసగా 11వ సారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను…

మరణానికీ ప్లానింగ్.. ఎందుకో తెలుసా?

మరణం.. మరణం.. మహా సేనా..! ఏది మరణం..? Mana Enadu:మన గుండె ధైర్యం కన్నా శత్రుబలగం పెద్దది అనుకోవటం మరణం.., రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బతికుండటం మరణం.. నాతో వచ్చేదెవరు..? నాతో చచ్చేదెవరు..? ‘బాహుబలి(Bahubali)’ క్లైమాక్స్ సీన్‌లో సైనికుల్లో స్థైర్యాన్ని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *