మన ఈనాడు:పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ బీటెక్ రవి అరెస్ట్ అయ్యారు. కడప నగర శివారులోని యోగి వేమన యూనివర్సిటీ దగ్గర స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
టీడీపీ నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జీ బీటెక్ రవిని రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప నుంచి పులివెందులకు వస్తుండగా కడప నగర శివారులోని యోగి వేమన యూనివర్సిటీ దగ్గర అదుపులోకి తీసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ రవిని ఎక్కడికి తీసుకెళ్లింది తెలియలేదని, టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఏ కేసులో రవిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.