మన ఈనాడుః ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్‌లో ఒంటరి మహిళపై ఐదుగురు వ్యక్తులు లైంగిక దాడి చేసిన ఘటన కలకలంరేపింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంట్లోకి చొరబడి ఆమె కాళ్లు, చేతులు కట్టేసి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం సిగరేట్లతో కాలుస్తూ మృగాళ్ల ప్రవర్తించారు.
మహిళల రక్షణ కోసం ఎన్ని కఠినమైన కొత్త చట్టాలు తెచ్చినా అఘాయిత్యాలు ఆగట్లేదు. ఎక్కడో ఒకచోట ప్రతిరోజు స్త్రీలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా పసిపిల్లలపై కూడా దారుణానికి పాల్పడుతున్నారు కామాంధులు. రోడ్లపైనే కాదు ఇంట్లోనూ ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు మృగాళ్ల వెంటపడి వేధిస్తున్నారు. తాజాగా లక్నోలో ఇలాంటి ఘటనే జరిగింది. తన ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై ఐదుగురు ఒకేసారి లైంగిక దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
ఈ మేరకు ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి తన ఇంట్లో ఒంటరిగా ఉంది. అయితే దీనిని గమనించిన ఐదుగురు దుండగులు రాత్రి 7.30 సమయంలో పక్కింటి పై కప్పు నుంచి ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. తర్వాత ఆమెను కదలకుండా పట్టుకుని వారి వెంట తెచ్చుకున్న మత్తుముందు కలిపిన బట్టను ఆమె ముక్కు దగ్గర పెట్టారు. దీంతో వెంటనే ఆ మహిళ స్పృహ కోల్పోయింది. అనంతరం వారు ఆమె కాళ్లు చేతులు కట్టేసి సామూహిక అత్యాచారం చేశారు. సిగరెట్లతో వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేశారని పోలీసులు తెలిపారు. ఈ భయంకరమైన సంఘటన మంగళవారం రాత్రి జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ఘటనలో మహిళ ఆరోగ్యం, నిందుతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.