Mana Enadu : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ‘రా మచ్చ మచ్చ (Raa Macha Macha)’ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో చెర్రీ తన ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టాడు. రామ్ చరణ్ స్వాగ్, అదిరిపోయే స్టెప్పులు ఈ పాటకు హైలైట్ గా నిలిచాయి.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమాలోని వీణ స్టెప్పు (Veena Step)ను ఈ పాటలో కాపీ చేశారు. ఈ స్టెప్పును చెర్రీ తన దైన స్వాగ్ లో చేసి అలరించారు. ఈ పాటలో రామ్ చరణ్ డ్యాన్స్ వేరే లెవెల్ ఉందని నెటిజన్లు అంటున్నారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) కంపోజ్ చేశారు. ఈ సాంగ్ ను నకాశ్ అజీజ్ పాడారు.
సీనియర్ డైరెక్టర్ శంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా (Game Changer)లో యస్ జే సూర్య (SJ Surya), అంజలి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ ఆఖరి వారంలో రిలీజ్ కానుంది.