తన అందంతో నేషనల్ క్రష్గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రష్మిక మందాన (Rashmika Mandanna) ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఓరియంటెండ్ చిత్రాలను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. తగంలో ఎప్పుడూ కనిపించనట్లుగా కుబేరాలో డీ గ్లామరైజ్ పాత్ర చేసి తన నటనతో ఆకట్టుకుంది. విమర్శకులు సైతం ఆమె యాక్టింగ్ను మెచ్చుకుంటున్నారు. ఇక నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend) మూవీ కూడా నాయికా ప్రాధాన్యమున్న చిత్రమే. ఇప్పుడు ఏకంగా ఓ వీరనారి పాత్రలో నటించనుంది.
రక్తంతో నిండిన కత్తిపట్టుకొని..
రవీంద్ర పూలే అనే కొత్త దర్శకుడితో ‘మైసా’ (Mysaa) అనే మూవీలో రష్మిక నటిస్తోంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఇది విడుదల కానుంది. శుక్రవారం విడుదల చేసిన టైటిల్ పోస్ట్‌లో రష్మిక రక్తంతో నిండిన కత్తిపట్టుకొని వీరనారి అవతారంలో కనిపించి ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘‘ధైర్యం ఆమె బలం. సంకల్పంలో లేదు కనికరం.. ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి’’..! అంటూ ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ ఓ పోస్టర్ షేర్ చేసింది.
ఇంతకు ముందెప్పుడూ పోషించని పాత్ర
ఈ పోస్టర్ను ఇన్స్టాలో షేర్ చేసిన రష్మిక (Rashmika)‘‘నేను ఎప్పుడూ కొత్తది, భిన్నమైనది, ఉత్తేజకరమైన చిత్రాలకు ప్రాధాన్యమిస్తాను. ‘మైసా’ అలాంటి వాటిలో ఒకటి. నేను ఇంతకు ముందెప్పుడూ పోషించని పాత్ర. ఎప్పుడూ అడుగుపెట్టని ప్రపంచం. ఇప్పటి వరకూ చేయని వెర్షన్. ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే..’’ అంటూ పెర్కొంది.
View this post on Instagram






