Rashmika: ‘ఆమె గర్జన వినడానికి కాదు భయపెట్టడానికి’.. పవర్ఫుల్గా రష్మిక కొత్త మూవీ టైటిల్

తన అందంతో నేషనల్ క్రష్గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రష్మిక మందాన (Rashmika Mandanna) ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఓరియంటెండ్ చిత్రాలను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. తగంలో ఎప్పుడూ కనిపించనట్లుగా కుబేరాలో డీ గ్లామరైజ్ పాత్ర చేసి తన నటనతో ఆకట్టుకుంది. విమర్శకులు సైతం ఆమె యాక్టింగ్ను మెచ్చుకుంటున్నారు. ఇక నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో నటిస్తున్న ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ (The Girlfriend) మూవీ కూడా నాయికా ప్రాధాన్యమున్న చిత్రమే. ఇప్పుడు ఏకంగా ఓ వీరనారి పాత్రలో నటించనుంది.

రక్తంతో నిండిన కత్తిపట్టుకొని..

రవీంద్ర పూలే అనే కొత్త దర్శకుడితో ‘మైసా’ (Mysaa) అనే మూవీలో రష్మిక నటిస్తోంది. ఐదు భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో ఇది విడుదల కానుంది. శుక్రవారం విడుదల చేసిన టైటిల్‌ పోస్ట్‌లో రష్మిక రక్తంతో నిండిన కత్తిపట్టుకొని వీరనారి అవతారంలో కనిపించి ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘‘ధైర్యం ఆమె బలం. సంకల్పంలో లేదు కనికరం.. ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి’’..! అంటూ ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌ ఓ పోస్టర్‌ షేర్‌ చేసింది.

ఇంతకు ముందెప్పుడూ పోషించని పాత్ర

ఈ పోస్టర్ను ఇన్స్టాలో షేర్ చేసిన రష్మిక (Rashmika)‘‘నేను ఎప్పుడూ కొత్తది, భిన్నమైనది, ఉత్తేజకరమైన చిత్రాలకు ప్రాధాన్యమిస్తాను. ‘మైసా’ అలాంటి వాటిలో ఒకటి. నేను ఇంతకు ముందెప్పుడూ పోషించని పాత్ర. ఎప్పుడూ అడుగుపెట్టని ప్రపంచం. ఇప్పటి వరకూ చేయని వెర్షన్‌. ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే..’’ అంటూ పెర్కొంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *