డ్రగ్స్ వద్దు.. వాటికంటే మతిచ్చేది ఇవే.. రామ్ చరణ్ కామెంట్స్ వైరల్

ప్రతి సంవత్సరం జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల(AntiDrug ) దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శిల్పకళా వేదికలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), ప్రముఖ నటులు రామ్ చరణ్(Ram Charan), విజయ్ దేవరకొండ(vijay Devarakonda), ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు(Dilraju) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. “రైజింగ్ తెలంగాణ” పేరుతో ఇలాంటి అద్భుతమైన అవగాహన కార్యక్రమానికి తనను ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. చిన్నప్పుడు స్కూల్‌లో ఇలాంటి కార్యక్రమాలకు హాజరయ్యేవాడినని గుర్తు చేశారు.

ఇటీవల స్కూల్‌ల బయట చిన్న పిల్లలకు డ్రగ్స్ ఇస్తున్నారనే వార్తలు తనను తీవ్రంగా కలచివేశాయని పేర్కొన్నారు. డ్రగ్స్ ద్వారా వచ్చే మత్తు కన్నా, చదువులో మంచి మార్కులు సాధించడంతో వచ్చే ఆనందమే గొప్పదని చరణ్ స్పష్టం చేశారు. అలాగే కుటుంబంతో గడిపే సమయం, స్నేహితులతో ఆనందంగా గడపడం ద్వారా కూడా నిజమైన సంతోషాన్ని పొందవచ్చన్నారు. డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని, తమ ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని కాపాడుకోవాలని చరణ్ సూచించారు.

ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎవరైనా డ్రగ్స్ వాడినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అటువంటి వ్యక్తులను పరిశ్రమ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డ్రగ్స్ ముప్పు నుంచి సమాజాన్ని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను అంతా ప్రశంసించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *