రవితేజ ఫ్యాన్స్​కు సడెన్ సర్ ప్రైజ్.. ఓటీటీలో ‘టైగర్ నాగేశ్వరరావు’

స్టార్ హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం మిడ్ నైట్ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సెన్సార్‌లో కట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఇందులో చూపించినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు ‘టైగర్ నాగేశ్వరరావు’ మేకర్స్. ఏలాంటి ప్రచారం, సమాచారం లేకుండానే ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసి ఫ్యాన్స్, నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా గురువారం అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే సెన్సార్‌లో కట్ అయిన కొన్ని సన్నివేశాలను ఇందులో చూపించినట్లు తెలుస్తోంది.

ఇక 1970లో గజగజలాడించిన స్టువర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీపై మొదటినుంచే అంచనాలు పెరిగిపోయాయి. దీంతో డిజిటల్ రైట్స్‌కు భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. చివరికీ ఈ మూవీ ఓటీటీ హక్కులను ఫేమస్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే దీనికోసం అమెజాన్ సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు తెలుస్తుండగా.. రవితేజ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ డీల్ అని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక 2023 అక్టోబర్ 20న థియేటర్ లో విడుదలైన ఈ సినిమా మొదటి రోజే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో రాకపోగా బాక్సాఫీస్ వద్ద నష్టాలతోనే రన్‌ను ముగించాల్సి వచ్చింది.
ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.

Related Posts

Ram Pothineni : హీరో రామ్ తో డేటింగ్.. రింగ్ చూపిస్తూ క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

టాలీవుడ్ చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని (Ram Pothineni) ఓ హీరోయిన్ తో డేటింగులో ఉన్నాడంటూ చాలా రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్ మహేశ్ బాబు.పి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘RAPO 22’…

తల్లిదండ్రులైన విష్ణువిశాల్‌- గుత్తా జ్వాల

కోలీవుడ్ నటుడు విష్ణువిశాల్ (Vishnu Vishal), బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల (Jwala Gutta) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తమ ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టినట్లు వారు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘మాకు ఆడపిల్ల పుట్టింది. ఆర్యన్‌ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *