ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా(Rekha Gupta) ప్రమాణస్వీకారం(Oath) చేశారు. ఇంటి నుంచి భారీ ర్యాలీతో రామ్‌లీల మైదానానికి చేరుకున్న రేఖాగుప్తాతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా(Lt. Governor VK Saxena) ప్రమాణం చేయించారు. దీంతో తొలిసారి MLAగా గెలిచిన ఆమె సీఎం పదవిని చేపట్టిన మహిళా నేతగా రికార్డు సృష్టించారు. రామ్‌లీలా మైదానంలో ప్రజల సమక్షంలో రేఖా గుప్తా పట్టాభిషేక కార్యక్రమం జరిగింది. రేఖాగుప్తాతోపాటు పర్వేశ్ వర్మ(Parvesh Varma), మంజీందర్ సింగ్ సిర్సా, ఆశిష్ సూద్, పంకజ్ సింగ్, రవీందర్ ఇంద్రజ్ సింగ్ ప్రమాణం చేశారు. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో భాజపా అధికారాన్ని తిరిగి సంపాదించుకుంది, దీంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
नई पारी, नया आगाज, #दिल्ली में अब रेखा राज,#महिला_मुख्यमंत्री #रेखा_गुप्ता ने #दिल्ली_मुख्यमंत्री के रूप में #शपथ ली।#RekhaGupta #delhicmoathceremony #Cmrekhagupta #BJP @gupta_rekha @narendramodi @BJP4Delhi pic.twitter.com/oEcvlglU09
— journalist Sher Bahadur singh (@Jr_S_B_Singh) February 20, 2025
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Podi), కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా(Amit Shah)తో పాటు పలువురు ఎంపీలు, AP CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తదితరులు హాజరయ్యారు. అంతకుముందు రామ్‌లీలా మైదానానికి చేరుకుంటున్న క్రమంలో మార్గ మధ్యలో మర్గట్ వాలే బాబా టెంపుల్‌లో పూజలు నిర్వహించారు. మర్గట్ వాలే బాబా గుడిలో హనుమాన్‌ను దర్శనం చేసుకున్నారు.






