Reliance: అంబానీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రతన్ టాటా తమ్ముడు

Mukesh Ambani: రతన్ టాటా, అతని కుటుంబం చాలా ఏళ్లుగా టాటా గ్రూప్‌ను భారీ లాభాల్లోకి నడిపిస్తున్నారు. తాజాగా ఆయన తమ్ముడు నోయెల్ టాటా తన కంపెనీ టాటా ట్రెంట్ ద్వారా మరో వెంచర్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇది రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ఆందోళన కలిగిస్తోంది.

నోయెల్ టాటా తాజాగా కొత్తగా సమోహ్ అనే సాంప్రదాయ భారతీయ దుస్తుల బ్రాండ్ ప్రారంభించాలని చూస్తున్నారు. ఇది టాటా ట్రెండ్ కింద నడవనుంది. సరసమైన ధరలకు సాంప్రదాయ దుస్తులను విక్రయిస్తుంది. సమోహ్ తన మొదటి స్టోర్‌ను ఉత్తరప్రదేశ్‌, లక్నోలోని హజ్రత్‌గంజ్‌లో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా వీటిని విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ట్రెంట్ యొక్క ప్రీమియం అకేషన్ వేర్ కాన్సెప్ట్ సమోహ్ లాంచ్‌ను ప్రకటించినందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా నోయెల్ అన్నారు.

ఈ బ్రాండ్ దుస్తుల శ్రేణి సాంప్రదాయ మూలాల నుండి ప్రేరణ పొందిందని ఆయన వెల్లడించారు. జీవితంలో ప్రత్యేక క్షణాల కోసం షాపింగ్ చేస్తున్నప్పుడు వారికి విలాసవంతమైన, అధునాతనమైన అనుభూతిని వినియోగదారులు పొందుతారని ఆయన అన్నారు. ఇది సాంప్రదాయ దుస్తుల మార్కెట్లో ప్రజాదరణ పొందిన మాన్యవర్‌కు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు. అలాగే కొత్త వెంచర్ ఇషా అంబానీ నేతృత్వంలో నడుస్తున్న రిలయన్స్ ట్రెండ్స్ సైతం గట్టి పోటీని ఎదుర్కోక తప్పదని వెల్లడైంది.

నోయెల్ టాటా ట్రెంట్ 1998లో స్థాపించబడింది. ప్రస్తుతం టాటా గ్రూప్ కింద వెస్ట్‌సైడ్, ట్రెంట్ హైపర్‌మార్కెట్, ల్యాండ్‌మార్క్ స్టోర్స్, జూడియో వంటి అనేక స్టోర్ బ్రాండ్‌లను కలిగి ఉంది. మరికొన్ని రోజుల్లో దేశంలో పండుగల సీజన్ ప్రారంభం అవుతున్న తరుణంలో ప్రజలు సైతం సాంప్రదాయ దుస్తుల షాపింగ్ షురూ చేశారు. ప్రస్తుతం టాటా ట్రెంట్ మొత్తం ఆదాయం రూ.2,000 కోట్లకు పైగా ఉంది. అయితే ఇది ప్రధానంగా అంబానీ-టాటాల మధ్య పోటీ హీట్ పెంచనుంది.

Share post:

లేటెస్ట్