హైదరాబాద్: రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు RBI ఇప్పటికే ప్రకటించింది. 30 సెప్టెంబర్ 2023 వరకు నోట్ల మార్పిడి అవకాశం ఇచ్చింది. మొత్తంగా రూ.3.56లక్షల కోట్ల రూ.2వేల నోట్ల చెలామణిలో ఉన్నట్లు తెలిపింది.
బ్యాంకుల ద్వారా రూ.వేల నోట్లను డిపాజిట్ చేసుకోవాలని ఆర్బీఐ విస్తృతంగా ప్రజలకు ప్రచారం కల్పించింది. కానీ నేటికి 10శాతం కూడా మార్పిడి జరగలేదని బ్యాంకు వర్గాలు తెలుపుతున్నాయి. మరో నాలుగు రోజుల మాత్రమే గడువు ఉండటంతో నోట్ల మార్పిడి కోసం పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని బ్యాంకుల్లో డిపాజిట్ కౌంటర్లు పెంచే ఏర్పాట్లు సైతం చేస్తున్నారు.
మరికొంతమంది మాత్రం నోట్ల మార్పిడికి గడుపు పెంచుతారానే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. కానీ ఆర్బీఐ ఇప్పటికే ఆరు నెలలు గడువు ఇచ్చింది. మరోసారి నోట్ల మార్పిడిపై గడువు పెంచే ప్రస్తక్తి లేదని స్పష్టం చేసింది. అక్టోబర్ మొదటిరోజు నుంచే రూ.2వేల నోట్ల చెలామణి కావని తెలిపింది.