విశాఖ ACA-ADCA స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (Andhra Premier League-4) నేటి (ఆగస్టు 8) నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో ఏడు జట్లు తలపడతాయని ఏపీఎల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు(Chairman Sujay Krishna Ranga Rao) తెలిపారు. ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) ముఖ్య అతిథిగా పాల్గొటారన్నారు. ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా సినీనటుడు వెంకటేశ్(Venkatesh) ఉన్నారని చెప్పారు. కాగా ఈ లీగ్‌లో కాకినాడ కింగ్స్, సింహాద్రి వైజాగ్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్‌షైన్, భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్లు తలపడనున్నాయి. కాగా టీమ్ఇండియా ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి భీమవరం బుల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
విజేతకు రూ.35 లక్షలు, రన్నర్‌కు రూ.25 లక్షలు
ఇక, ఏపీఎల్ సీజన్ 4లో జరిగే 25 మ్యాచులో 21 లీగ్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్స్ జరుగుతాయి. విజేతకు రూ.35 లక్షలు, రన్నర్‌కు రూ.25 లక్షలు నగదు బహుమమతి అందజేయనున్నారు. ఈ లీగంలో అండర్ 16 క్రీడాకారులకూ అవకాశం కల్పించారు. యువతలో ప్రతిభను వెలికితీయడానికి ఏపీఎల్ ఉపయోగపడుతుందని ఛైర్మన్ అభిప్రాయపడ్డారు. క్రీడాకారులు(Players) తమ సత్తా చాటాలని ఆయన చెప్పారు. ప్రతిభ చూపేవారికి మంచి భవిష్యత్తు ఉంటుందని.. IPL సెలక్టర్లు కూడా ఈ మ్యాచ్‌లు చూసేందుకు వస్తున్నారని చెప్పారు. మ్యాచ్‌ల్లో DRS విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ ద్వారా ప్రత్యక్షప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు.
From the beautiful beaches of #Vizag to the tranquil banks of Tungabhadra to pristine Rayalaseema, all of #AndhraPradesh is getting padded up.
The Andhra Premier League cricket championship is taking off soon! Are you ready? 🚀🚀#DhummuLepu @theacatweets #APL2025 pic.twitter.com/kUI7F7Bt03
— Lokesh Nara (@naralokesh) August 7, 2025






