₹11,475కే సికింద్రాబాద్‌ నుంచి శబరిమల.. IRCTC ప్యాకేజీ వివరాలివే

Mana Enadu : శబరిమల యాత్ర (Sabarimala Yatra)కు వెళ్లాలనుకునే వారికి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్‌ (Irctc Sabarimala Package From Hyderabad) నుంచి శబరిమలకు యాత్ర కోసం రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. నవంబర్‌ 16 నుంచి 20వ తేదీ వరకు కొనసాగనుంది.

ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే

  1. ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్‌, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్ల మీదుగా వెళ్లనుంది. ఇక శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం, ఎర్నాకుళం చోటానిక్కర్‌ అమ్మవారి ఆలయాలను (Sabarimala to ernakulam distance) కవర్‌ చేస్తూ ఈ యాత్ర మొత్తం నాలుగు రాత్రుళ్లు, ఐదు పగళ్లు కొనసాగుతుంది. టికెట్‌ ధరలు రూ.11,475 నుంచి ప్రారంభమవుతాయి.
  2. Day-1 : నవంబర్‌ 16న ఉదయం 8 గంటలకు ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది.
  3. Day -2 : మరుసటి రోజు రాత్రి 7 గంటలకు కేరళలోని చెంగనూర్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నీలక్కళ్‌కు వెళ్లి..  కేరళ ఆర్టీసీ బస్సుల్లో పంబ వరకు తీసుకెళ్తారు.
  4. Day -3 : మూడో రోజున శబరిమల దర్శనం, అభిషేకం (sabarimala booking) పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట వరకు నీలక్కళ్‌నుంచి చోటానిక్కర/ఎర్నాకుళంలో రాత్రి బస చేస్తారు.
  5. Day -4 : నాలుగో రోజున ఉదయం 7 గంటలకు చోటానిక్కర అమ్మవారి (Chottanikkara temple ) ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్‌కు చేరుకుంటే.. ఎర్నాకుళం టౌన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు రైలు బయల్దేరుతుంది.
  6. Day -5 : రాత్రి 9.45 గంటలకు తిరిగి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

ప్యాకేజీ ఛార్జీల వివరాలు ఇవే

  • ఎకానమీ (SL) కేటగిరీలో ఒక్కో టికెట్‌ ధర రూ.11,475గా ఉంది. ఇక  5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.10,655 చెల్లించాల్సి ఉంటుంది.
  • స్టాండర్డ్‌ (3AC)కేటగిరీలో రూ.18,790 చెల్లించాల్సి ఉంటుంది. అదే 5-11 ఏళ్ల చిన్నారులకు టికెట్ ధర రూ.17,700.
  • కంఫర్ట్‌ (2AC) కేటగిరీలో రూ.24,215..  5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.22,910

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *