ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్ల దాటికి శ్రీలంక టీమ్ చతికిలపడింది. సిరాజ్ వీరవిహారానికి బుమ్రా, హార్దిక్ బౌలింగ్, అందరు ఆటగాళ్ల చురుకైన ఫీల్డింగ్‌తో 50 పరుగులకే శ్రీలంక ఆలౌటైంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అతి తక్కువ పరుగులు చేసిన టీమ్‌గా మూడోసారి చెత్త రికార్డును మూటగట్టుకుంది లంక. 2012లో దక్షిణాఫ్రికా మీద 43 పరుగులతో, 1986లో వెస్టిండీస్ పై 55 పరుగులతో మరో రెండు చెత్త రికార్డులూ లంక ఖాతాలో ఉన్నాయి. మరికొద్దిసేపట్లో భారత బ్యాటింగ్ మొదలు కానుంది.