ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాదీ బౌలర్ సిరాజ్ చెలరేగిపోయాడు. ఆదివారం ఆటలో సిరాజ్ బౌలింగ్‌కి శ్రీలంక బ్యాటర్లు విలవిల్లాడిపోతున్నారు. ఫేవరేట్ టీంగా సొంత గడ్డపై బరిలో దిగిన లంక బృందాన్ని కేవలం ఆరు ఓవర్లలో 16 పరుగులతో ఆరు వికెట్లు కోల్పోయే స్థితికి తెచ్చాడు సిరాజ్. బుమ్రా తొలి ఓవర్లోనే వికెట్ తీసి ఆట మొదలుపెట్టగా వరసగా ఐదు వికెట్లు తీసి సిరాజ్ వేట కొనసాగిస్తున్నాడు. దీంతో తెలుగు క్రికెట్ ప్రేమికులు సిరాజ్ మియాను ఆకాశానికెత్తేస్తున్నారు. ప్రస్తుత స్థితిలో భారత్ గెలుపు లాంఛనంగా మారింది. ఈసారి ఆసియా కప్ దాదాపు భారత్ ఖాతాలోకి చేరినట్లే. వార్త పోస్టు చేసే సమయానికి… Srilanka : 20 – 6 (7.2) తో ఆట కొనసాగిస్తోంది.
Rohit Sharma: రోహిత్ శర్మ పాకిస్థాన్‌కు వెళ్లాల్సిందేనా?
మరికొన్ని రోజుల్లో మినీ వరల్డ్ కప్‌గా భావించే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19నుంచి పాకిస్థాన్(Pakistan), UAE వేదికగా ఈ మినీ సంగ్రామం మొదలు కానుంది. ఇప్పటికే భారత్(Team Indai) మినహా దాదాపు అన్ని జట్లు…