MMTS Sexual Assault Case: భలే నమ్మించిందిగా.. యువతి అత్యాచార ఘటనలో బిగ్ ట్విస్ట్

తెలంగాణ హైదరాబాద్‌లో గతనెల 22న MMTS Trainలో యువతిపై అత్యాచారయత్నం జరిగిందన్న వార్త సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న రైల్వే పోలీసులు(Railway Police) దాదాపు నెలరోజులుగా దర్యాప్తు చేశారు. దీంతో వారికి షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. అసలు సదరు యువతి(Women)పై అత్యాచారమే జరగలేదని సంచలన ప్రకటన చేశారు. యువతి కావాలనే అందరినీ తప్పుదోవ పట్టించిందని రైల్వే ఎస్పీ చందనా దీప్తి(Railway SP Chandana Deepti) తెలిపారు. ట్రైన్లో రీల్స్(Reels) చేస్తుండగా యువతి రైలు నుంచి కింద జారిపడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు వెల్లడించారు. ఈ కేసులో 250CC కెమెరాలు పరిశీలించి 100 మంది అనిమానితులను పరిశీలించినప్పటికీ అత్యాచార యత్నం జరిగినట్లు ఎక్కడా ఆధారాలు(Evidance) దొరకలేదన్నారు. దీంతో ఈ మేరకు కేసును క్లోజ్ చేసినట్లు SP ప్రకటించారు.

Hyderabad Shocker: Woman Fleeing Sexual Assault Jumps from Moving MMTS  Train in Hyderabad

ఇంతకీ ఏమైందంటే..

సికింద్రాబాద్ (Secunderabad) నుంచి మేడ్చల్ (Medchal) వెళుతుండగా MMTSలో గుర్తు తెలియని వ్యక్తి తనపై అత్యాచారయత్నం చేశాడంటూ ఓ యువతి పేర్కొంది. మార్చి 22న కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడిన ఆమెను తొలుత గాంధీ ఆసుపత్రికి, ఆ తర్వాత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పుడు పైతతంగాన్ని ఆ యువతి పోలీసులకు చెప్పింది. అయితే తాజా విచారణలో అదంతా కట్టుకథ అని పోలీసులు తేల్చారు. కాగా ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *