ManaEnadu : బాలీవుడ్ లో బడా బడా హీరోల సినిమాలతో కలిసి రిలీజ్ అయినా.. స్టార్ హీరోల చిత్రాలకు దీటుగా నిలబడి.. బాక్సాఫీస్ వద్ద క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా.. ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్స్ సాధించిన లేటెస్ట్ మూవీ ‘స్త్రీ 2 (Stree 2)’. స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor), వర్సటైల్ యాక్టర్ రాజ్‌కుమార్ రావు జంటగా కలిసి నటించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్లతో భారీ బ్లాక్ బస్టర్‌ను అందుకుంది.
అమెజాన ప్రైమ్ లో
థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో (Stree 2 ott)నూ రికార్డు క్రియేట్ చేసేందుకు వచ్చేసింది. స్త్రీ 2 సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూసిన మూవీ లవర్స్ కు ఈ చిత్రబృందం అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్.
చిన్న ట్విస్ట్ తో ఓటీటీలోకి
సాధారణంగా ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే ఫ్రీగా చూసేయొచ్చు. కానీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మాత్రం కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చినా రెంట్ పే చేసి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు స్త్రీ2 (Stree 2 Prime Video) సినిమా కూడా ఈ జాబితాలోనే చేరింది. ఇది ప్రస్తుతానికి ఫ్రీగా అందుబాటులో లేదు. అద్దె ప్రాతిపదికన రూ.349కు స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా చూడాలంటే రూ.349 పే చేసి చూడాలన్నమాట. మరికొన్ని రోజుల్లో ఫ్రీగా చూసే వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది.
స్త్రీ-2కు సీక్వెల్
ఇక స్త్రీ2 సినిమా సంగతికి వస్తే ఈ మూవీకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఆరేళ్ల క్రితం శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు (Raj Kumar Rao) జంటగా నటించిన స్త్రీ సినిమా సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గానే స్త్రీ-2 తెరకెక్కింది. ఈ సినిమా సుమారు రూ.600 కోట్ల వరకు వసూళ్లను సాధించి బాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లను అందుకున్న చిత్రంగా కొత్త రికార్డును నెలకొల్పింది. మరోవైపు స్త్రీ-2కి కూడా సీక్వెల్ స్త్రీ-3 (Stree 3) రాబోతున్నట్లు టాక్.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…