Mana Enadu : సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) – 2024 వేడుక దుబాయి వేదికగా గ్రాండ్ గా జరిగింది. సెప్టెంబరు 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ వేడుకలో సౌత్ ఇండియన్ స్టార్స్ సందడి చేశారు. రెడ్ కార్పెట్ పై ట్రెండీ ఔట్ ఫిట్స్ లో అందాల తారలు హొయలొలికారు. మరోవైపు ఫరియా అబ్దుల్లా, శ్రేయ, నేహాశెట్టి (Neha Shetty), శాన్వీ తదితరులు తమ డ్యాన్స్ పర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను అలరించారు.
మొదటి రోజు తెలుగు, కన్నడ సినిమా ఇండస్ట్రీలకు సంబంధించి బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన నటీనటులు, చిత్ర బృందాలకు అవార్డులు (siima awards 2024 winners) అందించారు. 2024 సంవత్సరానికి ‘దసరా’ (Dasara Movie) మూవీలో నటనకు ఉత్తమ నటుడిగా నాని (Nani), ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ (Keerthy suresh)ను సైమా అవార్డు వరించింది. బెస్ట్ సినిమాగా బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth kesari) కి పురస్కారం దక్కింది.
‘సైమా’ 2024 అవార్డ్ (SIIMA Awards 2024) విన్నర్స్ వీరే!
- బెస్ట్ యాక్టర్ : నాని (దసరా)
- బెస్ట్ నటి: కీర్తి సురేశ్ (దసరా)
- ఉత్తమ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా)
- ఉత్తమ సినిమా : భగవంత్ కేసరి
- ఉత్తమ సహాయ నటుడు: దీక్షిత్ శెట్టి (దసరా)
- ఉత్తమ సహాయ నటి: బేబీ ఖియారా ఖాన్ (Hi Nanna)
- ఉత్తమ కమెడియన్ : విష్ణు (మ్యాడ్)
- ఉత్తమ పరిచయ నటి: వైష్ణవి చైతన్య (బేబీ)
- ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : అబ్దుల్ వాహబ్ (హాయ్‌నాన్న, ఖుషి)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: భువన గౌడ (Salar)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు-బలగం)
- ఉత్తమ పరిచయ నటుడు: సంగీత్ శోభన్ (మ్యాడ్)
- ఉత్తమ పరిచయ డైరెక్టర్: శౌర్యువ్ (హాయ్ నాన్న)
- ఉత్తమ పరిచయ నిర్మాత: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ (హాయ్ నాన్న)
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ఆనంద్ దేవరకొండ (బేబీ)
- ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాళ్ ఠాకూర్
- ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): సాయి రాజేశ్