ManaEnadu: పదకొండు రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు అందుకున్న గణనాథులు ఇక గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఇప్పటికే తెలంగాణ(Telangana) వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొందరు వినాయకుల నిమజ్జన(Ganpati Visarjan) కార్యక్రమం పూర్తిచేశారు. మరికొందరు 11రోజుల పూజల తర్వాత నిమజ్జన తంతు పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 17న గణేశ్ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ముఖ్యంగా భాగ్యనగరంలో నిర్వహించనున్న వినాయక శోభాయాత్రపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(Hyderabad Police Commissioner CV Anand) కీలక ప్రకటన చేశారు. ఖైరతాబాద్ గణేష్(Khairatabad Ganesh) నిమజ్జనాన్ని ఈనెల 17 మధ్యాహ్నం 1.30 గంటలోపు పూర్తి చేయనున్నట్లు సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటల వరకు పూజలు ముగించుకుని, నిమజ్జనానికి తరలివెళ్లనున్నట్లు తెలిపారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీవీ తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 30 వేల మందితో బందోబస్తు కల్పిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు GHMC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా హుస్సేన్ సాగర్(Hussain Sagar) వద్ద రద్దీని తగ్గించేందుకు నగరంలోని ఇతర చెరువులతో పాటు బేబీ పాండ్స్, పూల్ పాండ్స్‌ను సిద్ధం చేస్తోంది. నిమజ్జనానికి భారీ క్రేన్లు, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడానికి సిబ్బంది, వాహనాలనూ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
దాదాపు 30 వేల మందితో బందోబస్తు
హైదరాబాద్(Hyderabad)లో గణేష్ నిమజ్జనానికి 30 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామన్నారు. లక్షకుపైగా గణేష్ విగ్రహాలు నిమజ్జనాకి తరలివస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. నిమజ్జనం సమయంలో ఎలాంటి ఘర్షణలు, ప్రాణనష్టం, సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. నగరంలో 15వేల మంది సిబ్బంది, బయట నుంచి 10 వేల సిబ్బందిని బందోబస్తుకు సిద్ధం చేశామన్నారు. సెప్టెంబర్ 16, 17న రెండ్రోజుల పాటు పెద్ద ఎత్తున నిమజ్జనాలు జరుగుతాయన్నారు. ఈ రెండ్రోజులు 30 వేల మంది పోలీసు సిబ్బంది పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. నిమజ్జనం సజావుగా సాగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
GHMC, పోలీసులు, విద్యుత్ సిబ్బంది సమన్వయంతో..
GHMC పరిధిలో సుమారు లక్ష గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉంది. హుస్సేన్ సాగర్(Hussain Sagar)తో పాటు గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) పరిధిలో చెరువులను సిద్ధం చేస్తున్నారు. NTR మార్గ్, PVమార్గ్‌లో ఇప్పటికే భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. పీవీ మార్గ్‌లో నిమజ్జనాల సందడి మొదలైంది. ఈ నెల 17న భారీగా గణనాథులు సాగర్ వైపు తరలి రానున్నారు. నగరంలో మొత్తం 6 జోన్లలో ఐదు పెద్ద చెరువులతోపాటు తాత్కాలికంగా 73 కుంటలను నిమజ్జనానికి సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. కూకట్ పల్లి జోన్ లో 11, ఎల్బీనగర్ జోన్ లో 12, ఛార్మినార్ జోన్‌లో 10, ఖైరతాబాద్ జోన్‌లో 13, శేరిలింగంపల్లి జోన్‌లో 13, Secunderabad జోన్‌లో 12 తాత్కాలిక కుంటలను నిమజ్జనానికి సిద్ధం చేశామన్నారు. ఇక Khairatabad బడా గణేష్ నిమజ్జనానికి ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే శోభయాత్ర మార్గంలో చెట్ల కొమ్మలను తొలగించారు. నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు GHMC Commissioner ఆమ్రపాలి తెలిపారు. GHMC, పోలీసులు, విద్యుత్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. గణేష్ నిమజ్జన ప్రక్రియకు 140 స్టాటిక్ క్రేన్‌లు, 295 మొబైల్ క్రేన్లు, 102 మినీ టిప్పర్లు, 125 JCBలు, 160 గణేష్ యాక్షన్ టీమ్ లు ఏర్పాటు చేశామని ఆమ్రపాలి తెలిపారు. ఆయా ప్రాంతాల్లో 308 మొబైల్ మరుగుదొడ్లు కూడా సిద్ధం చేశామన్నారు.