
దేశంలో పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ వేళ బంగారం (Gold), వెండి (Silver)కి డిమాండ్ భారీగా పెరుగుతోంది. అయితే రోజురోజుకు పెరుగుతున్న ధరలు(Rates) మాత్రం కొనుగోలు దారులను హడలెత్తిస్తున్నాయి. అందుకే పుత్తడి కొనుగోలు చేయాలనుకునే వారు ఓసారి ఈ రేట్లు తెలుసుకుని వెళ్లడం బెటర్. ఎందుకంటే బులియన్ మార్కెట్లో క్షణం క్షణం వీటి ధరలు మారుతుంటాయి. అందుకే ఓ సారి చెక్ చేసుకొని కొనుగోలు చేయడం బెటర్. కాగా నేడు (ఫిబ్రవరి 14న) బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
ఈరోజు ధరలు ఇలా..
హైదరాబాద్(HYD)లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 పెరిగి రూ. 79,900 స్థాయికి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ రూ.110 పెరిగి రూ.87,160 వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 87, 310కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 80, 005కి చేరుకుంది. మరోవైపు విజయవాడ(Vijayawada)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87, 160కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 79, 990కి చేరింది.
మరోవైపు వెండి రేట్లు(Silver Price) ఈరోజు భారీగా పెరిగాయి. కిలోకి రూ.1000 పెరిగి రూ.1,00,500కి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోనూ ఇదే ధర ఉండగా.. విజయవాడలో కిలో వెండి ధర రూ. 1,06,900కు చేరుకుంది.