Bigg Boss 8 : హౌస్ నుంచి ఈ వారం సోనియా ఎలిమినేట్‌

Mana Enadu : బిగ్‌బాస్‌ సీజన్‌-8 (Bigg Boss 8 Telugu) నాలుగో వారం కూడా ముగిసింది. ఈ వారం హౌస్ నుంచి సోనియా (Sonia) ఎలిమినేట్‌ అయింది. నాలుగో వారంలో నాగమణి కంఠ, సోనియా, నబీల్‌, ప్రేరణ, ఆదిత్య ఓం, పృథ్వీలు నామినేషన్స్‌లో ఉండగా, చివరలో ఆదిత్యం ఓం (Adithya Om) సేఫ్‌ అయ్యాడు. ఇక సోనియా, మణికంఠలో ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నప్పుడు.. హౌస్‌లో ఉన్న 9మంది ఆ ఇద్దరిలో ఎవరి పక్షాన నిలబడితే వాళ్లు సేఫ్ అవుతారని హోస్టు నాగార్జున ప్రకటించారు.

మణికంఠ హౌస్‌లో ఉండాలనుకునే వాళ్లు లేచి నిలబడాలని నాగార్జున చెప్పగా.. ఆదిత్య ఓం, నబీల్‌, విష్ణు ప్రియ, ప్రేరణ, యష్మి, సీతలు అతడికి అనుకూలంగా ఓటు వేశారు. సోనియాకు సపోర్టుగా కేవలం నిఖిల్‌, పృథ్వీ, నైనిక నిలబడటంతో సోనియా ఎలిమినేట్‌ (bigg boss 8 telugu elimination) అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌నుంచి బయటకు వచ్చిన సోనియా ‘‘నేను హౌస్‌ నుంచి రావడానికి ఉదయం నుంచి సిద్ధంగానే ఉన్నాను. ఉన్నది ఉన్నట్లు చెబుతాను. చెప్పే పద్ధతి మార్చుకోవాలని చాలాసార్లు అనుకున్నా. ప్రయత్నించినా కుదరలేదు. అలాగే ఇక్కడి వరకూ వచ్చాను’’ అని చెప్పుకొచ్చింది.

ఇక మహాథాలీ అనే బోర్డు ఉంచి, ఎవరెవరు ఎలాంటి ఆహార పదార్థమో చెప్పమని సోనియాను నాగార్జున (Nagarjuna) అడగ్గా..విష్ణుప్రియ (Vishnu Priya)ను పులిహోరతో పోల్చుతూ..  తనకు నచ్చితే ఎంతైనా పులిహోర కలుపుతుందని..  నచ్చకపోతే అస్సలు పట్టించుకోదని చెప్పింది. పృథ్వీని పాయసంతో పోల్చుతూ చాలా స్వీట్ అంటూ.. నిఖిల్ ను అన్నంతో పోల్చుతూ రైస్ లేకపోతే ఉండలేం.. అలాగే నిఖిల్ (Nikhil) లేకపోతే అక్కడేం లేదంటూ చెప్పేసింది.  యష్మిని చేపల వేపుడుతో.. నబీల్ ను రోటీతో.. ప్రేరణను ఆవకాయతో.. నైనికను అప్పడంతో.. సీతను కాకరకాయతో పోల్చింది. 

వీకెండ్‌ ఎపిసోడ్‌ తర్వాత నాగార్జున వైల్డ్‌ ఎంట్రీల (bigg boss 8 telugu wild card entry) గురించి అధికారికంగా ప్రకటిస్తూ.. ఎంతమంది వస్తారనేది హౌస్‌మేట్స్‌ చేతుల్లో ఉందని చెప్పారు. కానీ ఎప్పుడు వస్తారనేది బిగ్‌బాస్‌ చేతుల్లో ఉందని తెలిపారు. ఈ వారం మిడ్‌ వీక్‌లో ఒక ఎలిమినేషన్‌ జరగబోతోందని ఎవరూ ఊహించని బాంబు పేల్చారు నాగ్.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *