తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో(Retro)’. సమ్మర్ స్పెషల్‌గా ఇవాళ (మే 1) వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వచ్చేసింది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బారజ్(Director Karthik Subbaraj) తెరకెక్కించిన ఈ మూవీపై ఫస్ట్ నుంచి అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. సంతోష్ నారాయణన్(Santosh Narayanan) మ్యూజిక్ అందించిన ఈ మూవీని 2D ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై జ్యోతిక (Jyothika), సూర్య ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్(Posters), టీజర్(Teaser), ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. మరి ఆ అంచనాలను రెట్రో అందుకుందా? రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ రోల్‌లో సూర్య ఏ మేరకు మెప్పించాడు. చాలా గ్యాప్ తర్వాత కనిపించిన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటన ఎలా ఉంది? అనే తదితర విషయాలు ఈ రివ్యూలో తెలుసుకుందామా..
స్టోరీ ఏంటంటే..
సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీం చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఆ తరువాత సూర్య చేసిన ఏ చిత్రం కూడా థియేటర్లో కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేదు. చివరగా కంగువాతో భారీ డిజాస్టర్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సారి కార్తీక్ సుబ్బరాజ్‌తో కలిసి ‘RETRO’ అంటూ వచ్చాడు. ఇక స్టోరీలోకి వస్తే.. రౌడీ అయిన తిలక్ (Joju George)కు పెంపుడు కొడుకు అయిన పారివేల్ కన్నన్ (Suriya). చిన్నప్పటి నుంచీ నవ్వు అంటే ఏంటో కూడా తెలియకుండా పెరుగుతాడు పారివేల్. పారివేల్‌ను నవ్వించేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి అంతా అలిసిపోతారు. పెరిగి పెద్దైన తరువాత కూడా పారివేల్ నవ్వడు. అలాంటి పారివేల్ జీవితంలోకి రుక్మిణి (Pooja Hegde) వస్తుంది.
/rtv/media/media_files/2025/03/16/rfH4SZQiYrd252slldBo.jpg)
ఓ సందర్భంలో తిలక్‌ను శత్రువుల మట్టుపెట్టేందుకు ప్రయత్నించగా.. ఆ ప్రమాదం నుంచి పారి అతన్ని కాపాడి నిజమైన కొడుకుగా అతని మనసులో స్థానం సంపాదించుకుంటాడు. అలా.. తిలక్ నీడలోనే మరో శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్(Gangstar)గా ఎదుగుతాడు. అయితే రుక్మిణి (Pooja Hegde)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక హింసాత్మక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంటాడు. హింసను వదిలేసి భార్య రుక్మిణితో కలిసి ప్రశాంతంగా జీవించాలనుకున్న పారి తాను అనుకున్నది సాధించాడా?అతని గతం.. దాంట్లో దాగున్న రహస్యాలేంటి? తిలక్‌తో ఎందుకు వైరం ఏర్పడింది? తాను వద్దనుకున్నా.. తనని వెంటాడుతున్న శత్రువులతో అతనెలాంటి యుద్ధం చేశాడు?అన్నదే మిగతా స్టోరీ.

ఎవరెలా చేశారంటే..
ఇక సూర్య ఒక హింసాత్మక గ్యాంగ్‌స్టర్, ప్రేమించే భర్తగా రెండు వెరియేషన్స్ లో అద్భుతమైన నటన కనబరిచాడు. ముఖ్యంగా ఆయన నటించిన ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకున్నాయి. అలాగే పూజా హెగ్డే ఒక సాధారణ అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఆమె కెమిస్ట్రీ సూర్యతో బాగా కుదిరింది. ఈ సినిమాతో ఆమెకు లాంగ్ టైమ్ తర్వాత హిట్ దక్కే అవకాశం ఉంది. ప్రకాష్ రాజ్, జోజు జార్జ్, జయరాం, నాజర్ వంటి నటులు తమ పాత్రల్లో బాగా నటించి, సినిమాకు బలమైన సపోర్ట్ ఇచ్చారు. హీరో, హీరోయిన్ల నటన, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ కాగా, నెమ్మదిగా సాగే కథ, స్క్రీన్ ప్లే, కథలో కొత్తదనం లేకపోవడ, కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించడం మైనస్. మొత్తంగా ‘రెట్రో’ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేయలేకపోయింది.
రేటింగ్: 2.5/5






