అలా చేయకుండా నోటిఫికేషన్లు ఇస్తే సీఎం కుర్చీ లాగేస్తాం: తీన్మార్ మల్లన్న

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddey), ఆ పార్టీ బహిష్కృత నేత, MLC తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో BCలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా నోటిఫికేషన్లు(Notifications) జారీ చేస్తే సీఎం రేవంత్ కుర్చీని లాగేస్తామని మల్లన్న హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు CMగా కొనసాగుతారని భావించామని, కానీ నోటిఫికేషన్ల ద్వారా BCలకు అన్యాయం చేస్తే ఆయన పదవీ కాలం ముగిసినట్లేనని అన్నారు. బీసీ చైతన్య సభ(BC Chaitanya Sabha)లో ఆయన మాట్లాడారు. రూ.8 లక్షల ఆదాయం ఉంటే పేదవాడు, రూ. 2 లక్షల ఆదాయం ఉంటే ధనవంతుడు అనే విధంగా చట్టాలు రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Important Instructions for Muslims Regarding Telangana's Caste Survey

పెట్టుబడుల కోసం అంత దూరం ఎందుకు?

అలాగే EWS రిజర్వేషన్లను పూర్తిగా నిర్మూలించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. EWS వ్యవస్థ మనుగడలో లేకుండా చూస్తామని అన్నారు. పెట్టుబడుల కోసం CM ఒక బృందంతో జపాన్‌(Japan)కు వెళ్లారని గుర్తు చేశారు. జపాన్‌లో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారని విన్నామని, TGలోని 2 కోట్ల మంది BCలు ఒక్కొక్కరు చాయ్ ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇస్తే కోట్లాది రూపాయలు సమకూరేవని అన్నారు. పెట్టుబడుల కోసం అంత దూరం వెళ్లవలసిన అవసరం ఏముందని, బీసీలంతా కలిసి ఇచ్చేవారు కదా అని వ్యంగ్యంగా అన్నారు. రేవంత్ రెడ్డికి పరిపాలనాపరమైన జ్ఞానం లేకపోయినప్పటికీ, సీఎం పదవిలో ఉన్నందున ఆయనకు గౌరవం ఇస్తున్నామని అన్నారు. రేవంత్ రెడ్డికి పరిపాలనా రంగంలో అనుభవం లేదని, మోసం, కుట్ర, నయవంచన వంటి విషయాల్లో మంచి అనుభవం ఉందని విమర్శించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *