తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) నేటి నుంచి (మార్చి 12) ప్రారంభం కానున్నాయి. దీంతో అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. బుధవారం ఉ. 11 గంటలకు ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) ప్రసంగించనున్నారు. ఈ నెల 19 లేదా 20న వార్షిక బడ్జెట్(Annual Budget 2025-26)ను డిప్యూటీ సీఎం భట్టి సభలో ప్రవేశపెట్టే ఛాన్సుంది. ఈసారి 3.20 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈనెలాఖరు వరకు సమావేశాలు!
కాగా గవర్నర్ ప్రసంగం అనంతరం BAC సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు, ఏ అంశాలపై చర్చించనున్నారో ఖరారు చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలు(Budget Sessions) ఈనెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం ఉభయసభల్లో వేరు వేరుగా చర్చించి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేస్తారు. ఈనెల 17, 18 తేదీల్లో BCలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ(Classification of SC)ను ఆమోదిస్తూ తీర్మానం చేయనున్నారు.
సభకు హాజరుకానున్న కేసీఆర్
ఈ సమావేశాల్లో ప్రధానంగా బడ్జెట్తో పాటుగా SC వర్గీకరణ, BCలకు రిజర్వేషన్లు 42% అమలుచేస్తూ తీర్మానమే ప్రధానంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత KCR హాజరుకానున్నారు. తాను సమావేశాలకు వస్తానని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమావేశాలు ఆసక్తికరంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.







