Telangana Election: BRS అభ్యర్థి గువ్వల బాలరాజుపై రాళ్లదాడి

మన ఈనాడు:నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మె్ల్యే గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి జరిగింది. దీంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలంకొంది.

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మె్ల్యే గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి జరిగింది. దీంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలంకొంది.

అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు శనివారం రాత్రి ప్రచారం ముగించుకుని వెళ్తుండగా.. కాంగ్రెస్ శ్రేణులు తారసపడ్డాయి. దీంతో బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పరస్పరం దూషణకు దిగటంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. అదే సమయంలోనే ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై గుంపులో నుంచి ఒకరు రాయితో దాడికి పాల్పడ్డారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణనే స్వయంగా రాయితో కొట్టారని గువ్వల బాలరాజు అనుచరులు ఆరోపిస్తున్నారు.

ఈ దాడిలో గువ్వల బాలరాజు నుదుటిపై బలంగా తాకింది. దీంతో కిందపడిపోయిన ఎమ్మెల్యేను అనుచరులు హుటాహుటిన సమీప ఆసుపత్రిలోప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు.అయితే ఓటమి భయంతోనే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థితో పాటు ఆయన అనుచరులు దాడికి దిగారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

MMTS Sexual Assault Case: భలే నమ్మించిందిగా.. యువతి అత్యాచార ఘటనలో బిగ్ ట్విస్ట్

తెలంగాణ హైదరాబాద్‌లో గతనెల 22న MMTS Trainలో యువతిపై అత్యాచారయత్నం జరిగిందన్న వార్త సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న రైల్వే పోలీసులు(Railway Police) దాదాపు నెలరోజులుగా దర్యాప్తు చేశారు. దీంతో వారికి షాకింగ్ నిజాలు…

AI ChatGPT: గిబ్లీ ట్రెండ్.. నకిలీ ఓటర్, పాన్ కార్డులు తయారీ!

ప్రజెంట్ ఎక్కడ చూసి గిబ్లీ(Ghibli Photos) ఫొటోలే దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియా(Social Media) యాప్స్ వాడే ప్రతిఒక్కరూ తమ ఫొటోలను AI యాప్ చాట్‌జీపీటీ ద్వారా గిబ్లీ ఫొటోలోకి మార్చుకొని స్టేటస్, స్టోరీలు పెట్టుకుంటున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. తాజాగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *