తెలంగాణ అసెంబ్లీ(Telagana Assembly) మరో ప్రతిష్ఠాత్మక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లు(SC Classification Bill)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 59 SC కులాలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) సభలో బిల్లును ప్రవేశపెట్టింది. ఈమేరకు గ్రూపు-1 కేటగిరీలో అత్యంత వెనుకబడిన 15 కులాలకు ఒకశాతం, మాదిగలున్న గ్రూపు-2లోని కులాలకు 9%, మాలలున్న గ్రూపు-3లోని కులాలకు 5% రిజర్వేషన్లు(Reservations) కల్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై సభలో చర్చ అనంతరం SC వర్గీకరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపిందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్( Speaker Gaddam Prasad Kumar) తెలిపారు.

అంతకుముందు బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటోందని చెప్పారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎస్సీలకు కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని తెలిపారు. దశాబ్దాల పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, ఇన్నాళ్లకు తాను సీఎంగా ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్కారం కావడం ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోనే నిర్ణయం
అలాగే సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించామని ఆయన గుర్తు చేశారు. బాబూ జగ్జీవన్ రామ్(Babu Jagjivan Ram)కు కేంద్రంలో వివిధ శాఖల బాధ్యతలను అప్పగించి గౌరవించిందని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వ్యక్తి దామోదర సంజీవయ్యను CMగా చేసిందని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరిగిందని సీఎం ఈ సందర్భంగా వివరించారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీ లో ఆమోదించిన కాంగ్రెస్ ప్రభుత్వం..#SCclassification #TelanganaPrajaPrabuthwam pic.twitter.com/godtOU6Uun
— Marpu Modalaindi (@Marpu_TG) March 18, 2025







